Personal Accident policy: వ్యక్తిగత ప్రమాద బీమా.. ఈ విషయాలు తెలుసా?
Personal Accident policy: ఒక చిన్న ప్రమాదం మొత్తం కుటుంబాన్నే ఆర్థికంగా, మానసికంగా కుదిపేస్తుంది. అందుకే మనతో పాటు మన కుటుంబానికీ రక్షణ ఉండాలంటే వ్యక్తిగత ప్రమాద బీమా తీసుకోవడం మంచిది.
Personal Accident insurance policy | ఇంటర్నెట్ డెస్క్: కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రయాణాలకు చాలా మంది సొంత వాహనాలను ఉపయోగించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో రోడ్లపై వాహనాల సంఖ్య పెరిగిపోయింది. అలాగే రోడ్డు ప్రమాదాలు సైతం ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో అనుకోని దుర్ఘటనల నుంచి మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు కుటుంబానికీ భరోసానివ్వడం చాలా ముఖ్యం. అందుకే ప్రతిఒక్కరూ వ్యక్తిగత ప్రమాద బీమా (Personal Accident insurance policy) తీసుకోవాలి. తద్వారా ఏదైనా ఆపద వచ్చినా.. మనతో పాటు మన ఇంట్లో వాళ్లకి ఆర్థికంగా భరోసా ఉంటుంది.
వ్యక్తిగత ప్రమాద బీమా అంటే..
వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు అనుకోకుండా జరిగే ప్రమాదంలో వ్యక్తులు మరణించవచ్చు. ఒక్కోసారి పూర్తి అంగవైకల్యానికి గురవుతారు. లేదా పాక్షిక అంగవైకల్యం సంభవిస్తుంటుంది. అలాంటి ఆపద సమయంలో వ్యక్తిగత ప్రమాద బీమా (Personal Accident insurance policy) ఉంటే మనతో పాటు మన కుటుంబానికీ ఆర్థిక రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా ప్రమాదం వల్ల పాలసీదారుడికి ఏదైనా అయితే కుటుంబంపై ఆర్థిక భారం లేకుండా ఉంటుంది. ఈ పాలసీని కొనుగోలు చేయడానికి కనీస వయసు 18 సంవత్సరాలు. గరిష్ఠంగా 65 ఏళ్ల వరకు పాలసీని తీసుకోవచ్చు.
ఈ పాలసీలోనే ఫ్రాక్చర్ కేర్, ఈఎంఐ, రుణ చెల్లింపులు, ఎయిర్ అండ్ రోడ్ అంబులెన్స్ సర్వీస్ వంటి అదనపు సదుపాయాలను కూడా జత చేసుకోవచ్చు. ఒకవేళ శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే పనిచేసే వ్యక్తులు ఆదాయ మార్గాలను కోల్పోతారు. అలాంటి వారికి ఈ బీమా (Personal Accident insurance policy) వల్ల ఏకకాలంలో పెద్ద మొత్తంలో డబ్బు చేతికందుతుంది. దాన్ని ఇతర అవసరాలకు వాడుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ మధ్య బీమా కంపెనీలు అడ్వెంచర్ టూరిజం యాక్టివిటీస్‌కు కూడా పాలసీలను విస్తరిస్తున్నాయి. అంటే ఏదైనా సాహసోపేతమైన కార్యక్రమాల్లో పాల్గొని ప్రమాదానికి గురైనా బీమా వర్తిస్తుంది.
ఏమేం కవర్ అవుతాయంటే..
యాక్సిడెంటల్ డెత్ కవరేజ్: ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే నామినీ లేదా చట్టబద్ధ వారసులకు హామీ మొత్తం లభిస్తుంది.
శాశ్వత పూర్తి వైకల్యం: ఒకవేళ వ్యక్తికి వైకల్యం సంభవించి ఇక ఏ చికిత్స ద్వారా అతను/ఆమె తిరిగి కోలుకోలేని స్థితికి చేరితే.. పాలసీలో ఇచ్చిన హామీ మొత్తం చేతికందుతుంది. కొన్ని బీమా సంస్థలైతే హామీ మొత్తానికి రెట్టింపును కూడా ఆఫర్ చేస్తున్నాయి.
శాశ్వత పాక్షిక వైకల్యం: ప్రమాదం వల్ల పాలసీదారుడు శరీరంలో ఏదైనా భాగాన్ని లేదా చూపు, వినికిడి కోల్పోవడం వంటి వాటితో బటయపడితే.. చికిత్సకు అయ్యే ఖర్చును పాలసీలోని నిబంధనల ప్రకారం అందిస్తారు. వ్యక్తి స్థితిని బట్టి హామీ మొత్తంలో 25% నుంచి 90% వరకు అందే అవకాశం ఉంది.
తాత్కాలిక చికిత్స: ఒక్కోసారి పెద్దగా గాయాలేమీ కానప్పుటికీ.. ప్రమాదానికి గురైన వారికి వైద్యులు విశ్రాంతిని సూచిస్తుంటారు. అలాంటప్పుడు సదరు వ్యక్తి ఆదాయం కోల్పోవచ్చు. అలాగే ఆ సమయంలో అయ్యే ఖర్చులకు డబ్బు అవసరం అవుతుంది. అవి కవర్ అయ్యేలా పాలసీలోని నిబంధనల ప్రకారం రోజు లేదా వారం చొప్పున కొంత మొత్తం అందిస్తారు.
ఒక చిన్న ప్రమాదం మొత్తం కుటుంబాన్నే ఆర్థికంగా, మానసికంగా కుదిపేస్తుంది. అందుకే మనతో పాటు మన కుటుంబానికీ రక్షణ ఉండాలంటే ప్రమాద బీమా తీసుకోవడం మంచిది. తద్వారా అనుకోకుండా సంభవించే ప్రమాదాల సమయంలో కుటుంబానికి భరోసా ఉంటుంది. ఒకవేళ ఇంట్లో సంపాదించే వ్యక్తికి ఎలాంటి ఆపద వచ్చినా.. భవిష్యత్తు ఆర్థిక అవసరాలకు సరిపడా డబ్బు అందుతుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
భారతీయులకు వీసాల మంజూరులో జాప్యమేల?
-
Crime News
ప్రియుడి మర్మాంగం కోసిన యువతి
-
Ts-top-news News
భారత్‌లో మహిళలకు బైపాస్ సర్జరీ అనంతర ముప్పు తక్కువే!
-
Ap-top-news News
తిరుమల గగనతలంలో విమానాలు
-
Sports News
బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/06/2023)