Flipkart: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్‌ డేస్‌ వచ్చేశాయ్‌.. ప్రత్యేక ఆఫర్లతో పండగ సేల్‌

Flipkart Big Billion Days Sale: పండగ సీజన్‌ నేపథ్యంలో ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్ల హంగామాకు తెరతీసింది. ఆన్‌లైన్‌ కొనుగోలుదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ వివరాలను ప్రకటించింది.

Updated : 28 Sep 2023 10:24 IST

Flipkart Big Billion Days | ఇంటర్నెట్‌ డెస్క్‌: పండగల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఏటా నిర్వహించే ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌ (Flipkart Big Billion Days)’ ప్రత్యేక సేల్‌కు సిద్ధమైంది. ఇప్పటికే వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా ఓ మైక్రోసైట్‌ను క్రియేట్‌ చేసి వివిధ ఆఫర్లను ప్రకటించింది. తాజాగా ప్రత్యేక సేల్‌ (Flipkart Big Billion Days) తేదీలను ప్రకటించింది. అక్టోబర్‌ 08 నుంచి అక్టోబర్‌ 15 వరకు ఈ సేల్‌ జరగనుంది. ఐఫోన్‌ 13, శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌54, పిక్సెల్‌ 7ఏ సహా వివిధ ఎలక్ట్రానిక్, ఫ్యాషన్‌, బ్యూటీ, గృహోపకరణాలపై ఆకర్షణీయ ఆఫర్లు ఉన్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart Big Billion Days) ఇప్పటికే ప్రకటించింది.

ఇప్పటికే ప్రత్యేకంగా ప్రారంభించిన టీజర్‌ వెబ్‌సైట్‌లో ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart Big Billion Days) ఏయే ఫోన్లపై రాయితీలు, ఆఫర్లు ఉన్నాయో ప్రకటించింది. ఐఫోన్‌ 13, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్‌54, పిక్సెల్‌ 7ఏ, పోకో ఎక్స్‌5 ప్రో, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 అల్ట్రా, రెడ్‌మీ నోట్‌ 12 ప్రో, శాంసంగ్‌ గెలాక్సీ ఏ34, పోకో ఎఫ్‌5, శాంసంగ్‌ గెలాక్సీ ఏ23, ఒప్పో రెనో 10, మోటోరోలా ఎడ్జ్‌ 40, మోటోరోలా జీ54, శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌13 సహా మరికొన్ని స్మార్ట్‌ఫోన్లపై గణనీయ తగ్గింపు ఉండనున్నట్లు వెబ్‌సైట్‌ ద్వారా తెలుస్తోంది. మోటోపై సెప్టెంబర్‌ 28న, వివోపై 29న, ఇన్ఫీనిక్స్‌పై 30న, రియల్‌మీపై అక్టోబర్‌ 02న, శాంసంగ్‌పై 3న, పోకోపై 4న, గూగుల్‌ పిక్సెల్‌పై అక్టోబర్‌ 05న, రెడ్‌మీ ఫోన్లపై అక్టోబర్‌ 05న ఆఫర్లను ప్రకటించనున్నట్లు తెలిపింది.

బిగ్‌ బిలియన్‌ సేల్‌లో నథింగ్‌, పిక్సెల్‌ ఫోన్లపై భారీ డిస్కౌంట్‌

బిగ్‌ బిలియన్‌ సేల్‌ (Flipkart Big Billion Days)లో భాగంగా వివో టీ2 ప్రో 5జీ, మోటోరోలా ఎడ్జ్‌ 40 నియో, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌21 ఎఫ్‌ఈ, పిక్సెల్‌ 8 సిరీస్‌, వివో వీ29 సిరీస్‌, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్‌34 5జీ ఫోన్లు విడుదల కానున్నాయి. వీటితో పాటు ఇటీవలే విడుదలై మోటో జీ54 5జీ, రియల్‌మీ సీ51, గెలాక్సీ ఎఫ్‌34 5జీ ఫోన్లపై రాయితీ లభించనుంది. ఐఫోన్‌ 14 సిరీస్‌, ఐఫోన్ 13, గూగుల్‌ పిక్సెల్‌ 7, పిక్సెల్‌ 6 మోడళ్లపై భారీ డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్లు సమాచారం.

ఎలక్ట్రానిక్స్ అండ్‌ యాక్సెసరీస్‌పై 50-80% వరకు ఆఫర్‌ ఇవ్వనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart Big Billion Days) తెలిపింది. పాదరక్షలు, సంప్రదాయ దుస్తులు, ఆభరణాల వంటి ఫ్యాషన్‌ ఉత్పత్తులపై 90 శాతం వరకు ఆఫర్లు ఉన్నట్లు వెబ్‌సైట్‌ ద్వారా తెలుస్తోంది. బ్యూటీ ప్రోడక్ట్స్‌పైన 60- 80శాతం వరకు రాయితీ లభించనున్నట్లు పేర్కొంది. హోమ్‌డెకర్‌ విభాగంలో 80 శాతం, ఫర్నీచర్‌పై 85శాతం వరకు తగ్గింపు లభించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రిఫ్రిజిరేటర్లపై 70శాతం, 4కే స్మార్ట్‌ టీవీలపై 75 శాతం వరకు రాయితీ ఉండొచ్చని పేర్కొంది. వాషింగ్‌ మెషీన్లు రూ.5,000 నుంచే లభించనున్నట్లు వెబ్‌సైట్‌లో తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేసేవారికి ఆయా ఉత్పత్తులపై తగ్గింపు కూడా ఉంటుందని తెలిపింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని