Blue Dart: బ్లూడార్ట్‌ కీలక నిర్ణయం.. ‘భారత్‌ డార్ట్‌’ పేరుతో ఆ సేవలు

Blue Dart Bharat Dart: బ్లూడార్ట్‌ ఇకపై తన డార్ట్‌ప్లస్‌ సేవలను భారత్‌ డార్ట్‌గా వ్యవహరించనుంది. ఈ మేరకు స్టాక్‌ ఎక్స్ఛేంజీకి సమాచారం ఇచ్చింది.

Published : 13 Sep 2023 19:24 IST

Bharat Dart | దిల్లీ: దేశం పేరు ఇక ఇండియాకు బదులు భారత్‌ అని మారుస్తారంటూ చర్చ జరుగుతున్న వేళ ప్రముఖ లాజిస్టిక్‌ కంపెనీ బ్లూడార్ట్‌ (Blue Dart) కీలక ప్రకటన చేసింది. భారత్‌లో ప్రీమియం సేవల్లో ఒకటైన డార్ట్‌ ప్లస్‌ సేవలను ఇకపై భారత్‌ డార్ట్‌గా (Bharat Dart) వ్యవహరించనుంది. బ్లూడార్ట్‌ ప్రయాణంలో ఇదొక మైలురాయని, తమ వ్యూహాత్మక మార్పునకు నిదర్శనమని బ్లూడార్ట్‌ తన కంపెనీ ఫైలింగ్‌లో పేర్కొంది. భారత్‌ అవసరాలను తీర్చడంలో తమ నిబద్ధతను ఇది తెలియజేస్తోందని తెలిపింది. భారత్‌ను ప్రపంచానికి అనుసంధానం చేసే తమ ఈ ప్రయాణంలో భాగస్వామ్యపక్షాలన్నీ పాలుపంచుకోవాలని బ్లూడార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ పేర్కొంది.

కార్లకు 6 ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి కాదు: గడ్కరీ

ఇండియా, భారత్‌ అనే పేర్లపై చర్చ జరుగుతున్న వేళ బ్లూడార్ట్‌ తమ సేవలకు పేరు మార్చడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల జీ20 నేతలకు రాష్ట్రపతి పంపిన ఆహ్వాన ప్రతుల్లో ‘భారత్‌’ అని పేర్కొనడం దేశవ్యాప్త చర్చకు దారితీసింది. జీ20 శిఖరాగ్ర సదస్సులోనూ మోదీ తన నేమ్‌ ప్లేట్‌ను భారత్‌గా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 18న పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశానికి ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ సమావేశాల్లో పేరు మార్పునకు సంబంధించి ఏదైనా నిర్ణయం వెలువడే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వినవస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని