మార్కెట్లోకి BMW కొత్త బైక్‌.. టాప్‌ స్పీడ్‌ 314 km/h

బీఎండబ్ల్యూ మోటోరాడ్‌ ఇండియా కొత్త బైక్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధరను రూ.49 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.

Updated : 28 Jun 2023 17:09 IST

దిల్లీ: లగ్జరీ వాహనాలు తయారు చేసే బీఎండబ్ల్యూ సంస్థ (BMW) దేశీయ విపణిలోకి కొత్త బైక్‌ను తీసుకొచ్చింది. ఆధునికీకరించిన M 1000 RRను లాంచ్‌ చేసింది. దీని ధర రూ.49 లక్షల (ఎక్స్‌షోరూమ్‌) నుంచి ప్రారంభమవుతుంది. M 1000 RR కాంపిటీషన్‌ పేరిట తీసుకొచ్చిన మరో బైక్‌ ధర రూ.55 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. కంప్లీట్‌ బిల్ట్‌ అప్‌ యూనిట్‌గా ఈ మోడల్‌ వస్తోంది. బైక్‌ ప్రీ ఆర్డర్లు అన్ని బీఎండబ్ల్యూ మోటోరాడ్‌ ఇండియా అథరైజ్డ్‌ డీలర్ల వద్ద నేటి (జూన్‌ 28) నుంచి ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. 2023 నవంబర్‌ నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని పేర్కొంది. 

ఇక M 1000 RR ఫీచర్ల విషయానికొస్తే.. ఈ బైక్‌ 999 సీసీ ఇంజిన్‌తో వస్తోంది. కేవలం 3.1 సెకన్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గరిష్ఠంగా 314 కిలోమీటర్ల వేగంతో వెళుతుందని కంపెనీ పేర్కొంది. ఈ ఇంజిన్‌ 14,500rpm వద్ద 212bhp శక్తిని, 11,000 rpm వద్ద 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6.5 అంగుళాల టీఎఫ్‌టీ ఇన్స్‌ట్రుమెంట్‌ ప్యానెల్‌, ఎలక్ట్రానిక్‌ క్రూజ్‌ కంట్రోల్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి. రెయిన్‌, రోడ్‌, డైనమిక్‌, రేస్‌, రేస్‌ ప్రో 1-3 పేరిట రైడ్‌ మోడ్స్‌ లభిస్తాయి. ఏబీఎస్‌, ఏబీఎస్‌ ప్రో, డైనమిక్‌ ట్రాక్షన్‌ కంట్రోల్‌ వంటి అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు