Amazon: గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌కు అమెజాన్ రెడీ.. వీటిపైనే డీల్స్‌!

Amazon great Indian sale: గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌కు అమెజాన్‌ సిద్ధమైంది. దీనికి సంబంధించిన పేజీని ప్రదర్శిస్తోంది. ఎస్‌బీఐ కార్డుపై ఈ సారి ఆఫర్లు ఉండబోతున్నాయి.

Published : 23 Sep 2023 18:51 IST

Amazon great Indian sale 2023 | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ (Amazon) గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌కు సిద్ధమైంది. ‘త్వరలో’ ఈ సేల్‌ ప్రారంభం కాబోతోందంటూ సంబంధిత బ్యానర్‌ను అమెజాన్‌ వెబ్‌సైట్‌/ యాప్‌లో ప్రదర్శిస్తోంది. అయితే, ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతోందనే వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. అక్టోబర్‌ మొదటి వారం నుంచి ఈ సేల్‌ ప్రారంభయ్యే అవకాశం కనిపిస్తోంది. మరో ఇ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సైతం ఇదే తరహాలో బిగ్‌ బిలియన్‌ డేస్‌ పేరిట బ్యానర్‌ ప్రదర్శిస్తోంది.

ఈ ఏడాది అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌లో (Amazon Great Indian Festival 2023) ఎస్‌బీఐ (SBI) డెబిట్‌ కార్డు/ క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు సేల్‌లో 10 శాతం డిస్కౌంట్‌ లభించనుంది. మొబైల్స్‌, టీవీలు, ఫ్యాషన్‌, హోమ్‌, ఎలక్ట్రానిక్స్‌, బుక్స్‌, అలెక్సా డివైజ్‌లపై ఈ సేల్‌లో డిస్కౌంట్లు లభించనున్నాయి. వేటిపై ఎంతెంత డిస్కౌంట్‌ అనేది త్వరలో వెల్లడి కానుంది. ప్రస్తుతానికి ఆఫర్ల వివరాలేవీ వెల్లడికాలేదు. ప్రైమ్‌ సబ్‌స్క్రైబర్లకు ఎర్లీ యాక్సెస్‌, ఫ్రీ 1 డే డెలివరీ వంటి సదుపాయాలు ఉంటాయి. తొలిసారి అమెజాన్‌ ద్వారా ఆర్డర్‌ చేసేవారికి వెల్‌కమ్‌ రివార్డు అందిస్తామని అమెజాన్‌ పేర్కొంటోంది. 

మరోసారి బిగ్‌ బిలియన్ డేస్‌ సేల్‌.. వాటిపై భారీ డిస్కౌంట్!

మొబైళ్ల విషయానికొస్తే.. ఇటీవల విడుదలైన ఐకూ జడ్‌ 7 ప్రో, హానర్‌ 90 ప్రో 5జీ ఫోన్లపై డిస్కౌంట్లు ఉండబోతున్నాయని అమెజాన్‌ టీజ్‌ చేస్తోంది. వీటితోపాటు శాంసంగ్‌ ఎం34, వన్‌ ప్లస్‌ నార్డ్‌ సీఈ3, రియల్‌మీ 60 5జీ వంటి ఫోన్లను ఆఫర్లపై విక్రయించనున్నట్లు పేజీలో పేర్కొంది. అలెక్సా డివైజ్‌ల ధరలు రూ.2,499 నుంచి ప్రారంభమవుతాయని, ఫైర్‌ టీవీ స్టిక్‌ రూ.1,799, కిండ్లే రూ.6,799, అలెక్సా స్మార్ట్‌ హోమ్‌ డివైజ్‌లు రూ.2,649 నుంచి ప్రారంభవుతాయని పేర్కొంది. ఐఫోన్‌ పాత మోడళ్లను కొనుగోలు చేయాలనుకునేవారూ ఈ సేల్‌లో తక్కువ ధరకే పొందొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని