Hyundai i20: హ్యుందాయ్‌ ఐ20 ఫేస్‌లిఫ్ట్‌.. ధర, ఫీచర్లు ఇవే..!

Hyundai i20 facelift launched: హ్యుందాయ్‌ మోటార్స్ ఐ20 పేస్‌లిఫ్ట్‌ను తాజాగా లాంచ్‌ చేసింది. దీని ధర రూ.6.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Published : 08 Sep 2023 18:31 IST

Hyundai i20 | ఇంటర్నెట్ డెస్క్‌: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్‌ తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ ఐ20 (Hyundai i20) ఫేస్‌లిఫ్ట్‌ను లాంచ్‌ చేసింది. దీని ధర రూ.6.99 లక్షల నుంచి రూ.11.01 లక్షలుగా పేర్కొంది. 2023 ఐ20 రూపులోనూ, ఫీచర్లలో కొన్ని మార్పులు చేశారు. భద్రతాపరంగా అప్‌గ్రేడ్‌ చేశారు. అయితే, ఈసారి టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ను తొలగించారు. మూడేళ్లు లేదా లక్షన్నర కిలోమీటర్ల ఎక్స్‌టెండెడ్‌ వారెంటీ సదుపాయమూ ఇస్తున్నారు.

2023 ఐ20 అన్ని వేరియంట్లలోనూ భద్రతాపరమైన ఫీచర్లను జోడించారు. 6 ఎయిర్‌బ్యాగులు సహా ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, హిల్‌ అసిస్ట్‌ కంట్రోల్‌, వెహికల్‌ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్‌, యాంటీలాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌, ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌ డిస్ట్రిబ్యూషన్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంటీరియర్‌ విషయానికొస్తే.. ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్‌ చేశారు. 60 కనెక్ట్‌ ఫీచర్లు, ఓవర్‌ ది ఎయిర్‌ అప్‌డేట్స్‌, మల్టీ లాంగ్వేజ్‌ సపోర్ట్‌, టైప్‌-సి ఛార్జర్‌ వంటి సదుపాయాలున్నాయి.

తప్పనిసరి హాల్‌మార్కింగ్ పరిధిలోకి మరిన్ని జిల్లాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడే..

కొత్త ఐ20లో 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ అమర్చారు. మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌లో అయితే 82 బీహెచ్‌పీ పవర్‌ను ఈ ఇంజిన్‌ ఉత్పత్తి చేస్తుంది. అదే ఐవీటీ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌లో 86 బీహెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్‌, ఎల్‌ఈడీ డే టైమ్‌ రన్నింగ్‌ ల్యాంప్స్‌ ఇస్తున్నారు. 16 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ ఇస్తున్నారు. ఐ20 ఇప్పటికే 13 లక్షల మంది కస్టమర్ల అభిమానాన్ని చూరగొందని, కొత్త ఐ20 సైతం అంచనాలను అందుకుంటుందని కంపెనీ సీఓఓ తరుణ్‌ గార్గ్‌ పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు