BMW R18 Transcontinental: బీఎండబ్ల్యూ నుంచి 1,800 సీసీ బైక్‌.. ధర రూ.31 లక్షలు

BMW R18 Transcontinental: బీఎండబ్ల్యూ మోటారాడ్‌ ఆర్‌18 ట్రాన్స్‌కాంటినెంటల్ బైక్‌ ధర రూ.31.50 లక్షలు (ఎక్స్‌షోరూం). పెద్ద హ్యాండిల్‌ బార్‌తో వస్తోన్న ఈ బైక్‌కు విండ్‌స్క్రీన్‌, విండ్‌ డిఫ్లెక్టర్స్‌ కొత్త రూపునిస్తున్నాయి.

Published : 24 Mar 2023 00:19 IST

BMW R18 Transcontinental | ఇంటర్నెట్‌ డెస్క్‌: బీఎండబ్ల్యూ మోటారాడ్‌ ఆర్‌18 ట్రాన్స్‌కాంటినెంటల్ బైక్‌ను భారత్‌లో విడుదల చేసింది. దీని ధర రూ.31.50 లక్షలు (ఎక్స్‌షోరూం). పెద్ద హ్యాండిల్‌ బార్‌తో వస్తోన్న ఈ బైక్‌కు విండ్‌స్క్రీన్‌, విండ్‌ డిఫ్లెక్టర్స్‌ కొత్త రూపునిస్తున్నాయి. నాలుగు వృత్తాకార అనలాగ్‌ మీటర్లు, 10.25 అంగుళాల టీఎఫ్‌టీ స్క్రీన్‌ ఈ బైక్‌లో ప్రత్యేకంగా అమర్చారు.

ఆర్‌18 ట్రాన్స్‌కాంటినెంటల్‌ (BMW R18 Transcontinental)లో మార్షల్‌ గోల్డ్‌ సిరీస్‌ స్టేజ్‌2 సౌండ్‌ సిస్టమ్‌ను పొందుపర్చారు. దీంట్లో ఆరు స్పీకర్లు, ఒక సబ్‌వూఫర్‌ ఉన్నాయి. యాక్సెసరీస్‌ విషయంలో వినియోగదారులు కస్టమైజ్‌ చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది. యాక్టివ్‌ క్రూజ్‌ కంట్రోల్‌, ఆటోమేటిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, డైనమిక్‌ ఇంజిన్‌ బ్రేక్‌ కంట్రోల్‌, హిల్‌ స్టార్ట్‌ కంట్రోల్‌, కీలెస్‌ రైడ్‌, అడాప్టివ్‌ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌ ఈ బైక్‌లో ఉన్న మరికొన్ని ఫీచర్లు. మొత్తం మూడు రంగుల్లో ఇది అందుబాటులో ఉంది. బ్లాక్‌ స్టోర్మ్‌ మెటాలిక్‌, గ్రావిటీ బ్లూ మెటాలిక్‌, మాన్‌హాటన్‌ మెటాలిక్‌ మ్యాటే, ఆప్షన్‌ 719 మినరల్‌ వైట్‌ మెటాలిక్‌, ఆప్షన్‌ 719 గెలాక్సీ డస్ట్‌ మెటాలిక్‌, టైటన్‌ సిల్వర్‌ 2 మెటాలిక్‌ రంగుల్లో బైక్‌ లభిస్తోంది.

ఈ బైక్‌లో ఎయిర్‌ అండ్‌ ఆయిల్‌ కూల్డ్‌ బాక్సర్‌ ఇంజిన్‌ ఉంది. దీని సామర్థ్యం 1,802 సీసీ. 158 ఎన్‌ఎం టార్క్‌ వద్ద 91 హెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ ఉన్న ఈ బైక్‌లో రెయిన్‌, రోల్‌ అండ్‌ రాక్‌ రైడింగ్‌ మోడ్స్‌ ఉన్నాయి. ఈరోజు (2023 మార్చి 23) నుంచే ఈ బైక్‌ విక్రయానికి అందుబాటులో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని