BSNL tariff hike: కస్టమర్లకు BSNL సైలెంట్‌ షాక్‌.. వ్యాలిడిటీలో కోత!

BSNL Reduces Validity: ఎక్కువ మంది వినియోగించే నాలుగు ప్రీపెయిడ్‌ ప్లాన్ల వ్యాలిడిటీలో బీఎస్‌ఎన్‌ఎల్‌ కోత పెట్టింది. వినియోగదారులపై పరోక్షంగా భారం మోపింది.

Updated : 06 Mar 2023 19:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) వినియోగదారులకు సైలెంట్‌గా షాకిచ్చింది. కొన్ని ప్రీపెయిడ్‌ ప్లాన్ల (Prepaid plans) ధరలను పరోక్షంగా పెంచేసింది. ప్యాక్‌ ధరలు పెంచనప్పటికీ.. వ్యాలిడిటీలో కోత పెట్టింది. ఎక్కువగా వినియోగించే రూ.107, రూ.197, రూ.397, రూ.797 ప్లాన్ల విషయంలో ఈ మార్పు చేపట్టింది. వ్యాలిడిటీలో మార్పు ద్వారా తన ఆదాయాన్ని పెంచుకోబోతోంది.

ప్లాన్‌ రూ.107: ఈ ప్లాన్‌ ఇంతకుముందు 40 రోజుల వ్యాలిడిటీతో వచ్చేది. ప్రస్తుతం ఈ ప్లాన్‌ వ్యాలిడిటినీ 35 రోజులకు కుదించారు. ఇతర ప్రయోజనాల్లో ఎలాంటి మార్పూ చేయలేదు. 3జీబీ డేటా+ 200 నిమిషాల వాయిస్‌ కాలింగ్‌, 35 రోజులకు బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్స్‌ ఈ ప్లాన్స్‌ కింద లభిస్తాయి.

ప్లాన్‌ రూ.197: ఈ ప్లాన్‌ వ్యాలిడిటీని 84 రోజుల నుంచి 70 రోజులకు తగ్గించారు. 2జీబీ డేటా, అపరిమిత కాల్స్‌, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. సినిమాలు, మ్యూజిక్‌, షార్ట్‌ వీడియోస్‌ అందించే జింగ్‌ స్ట్రీమింగ్‌ యాప్‌ సదుపాయాన్ని 18 రోజుల నుంచి 15 రోజులకు కుదించారు.

ప్లాన్‌ రూ.397: 180 రోజుల వ్యాలిడిటీ కలిగిన రూ.397 ప్లాన్‌లోనూ మార్పులు చేశారు. ఈ ప్లాన్‌లో ఏకంగా 30 రోజుల వ్యాలిడిటీని కుదించి 150 రోజులకు పరిమితం చేశారు. ఈ ప్లాన్‌లో 2జీబీ వ్యాలిడిటీ, 100 ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత కాల్స్‌ లభిస్తాయి.

ప్లాన్‌ రూ.797: ఒకప్పుడు 365 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్‌ వచ్చేది. 60 రోజుల పాటు ఉచిత సేవలు లభించేవి. ప్రస్తుతం ఈ ప్లాన్‌ వ్యాలిడిటీని 300 రోజులకు కుదించారు. 60 రోజుల వ్యాలిడిటీ సమయంలో అపరిమిత కాల్స్‌, 2జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. అయితే, ఇతర ప్రైవేటు టెలికాం కంపెనీలతో పోలిస్తే ప్రీపెయిడ్‌ ప్లాన్లు ఇప్పటికీ కాస్త చౌకగానే లభిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని