Q-A: టర్మ్ పాలసీలో అన్ని రకాల ఆదాయాలూ చూపొచ్చా?
ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం చాలా మంచిది. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే దానికి అదనంగా సూపర్ టాప్ అప్ పాలసీని తీసుకోవడం ద్వారా మరింత ప్రయోజనం పొందేందుకు వీలుంటుంది.
నా వయసు 48 సంవత్సరాలు. నేను టర్మ్ పాలసీ ఆన్‌లైన్‌లో తీసుకోవాలనుకుంటున్నాను. ఐసీఐసీఐ పరిశీలించగా ఇన్‌కమ్ కాలమ్‌లో శాలరీ, సెల్ఫ్ ఎంప్లాయి ఆప్షన్లు ఉన్నాయి. నేను ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో పని చేసి నెలకు రూ. 30,000, అలాగే సొంతంగా అకౌంట్స్ కన్సల్టెన్సీ ద్వారా సుమారుగా సంవత్సరానికి 2,00,000 సంపాదిస్తాను. నేను ఆదాయం ఎలా చూపించాలి?
- సత్యనారాయణ
మీరు ఉద్యోగం చేస్తున్న చోట మీకు అందిన పే-స్లిప్స్‌తో పాటు మీ బ్యాంకు స్టేట్‌మెంట్ కూడా బీమా కంపెనీకు ఇవ్వాల్సి ఉంటుంది. మీరు సొంతంగా సంపాదించిన డబ్బులకు సంబంధించి కూడా ఏదైనా ఆధారాలు ఉంటే వారికి ఇవ్వచ్చు. కంపెనీ దాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. మీరు వారితో వివరంగా మాట్లాడడం మేలు. మాక్స్ లైఫ్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ ఆన్‌లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్‌సైట్‌లో ప్రీమియం పరిశీలించవచ్చు.
నా వయసు 29. నెల నెలా మ్యూచువల్ ఫండ్స్‌లో రూ. 2000 మదుపు చేయడానికి సూచనలు ఇవ్వండి. అలాగే, రూ. 5 లక్షల మొత్తానికి ఆరోగ్య బీమా సూచించండి.
- గౌడు నరసింహ మూర్తి
మీరు సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్‌లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. కనీసం 10 ఏళ్ల పాటు మదుపు చేస్తే మంచి రాబడి పొందగలరు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల (www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ యాప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయొచ్చు. ఇందులో మీరు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగ్యులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది. ఆరోగ్య బీమా పాలసీ కూడా తీసుకోవడం చాలా మంచిది. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే దానికి అదనంగా సూపర్ టాప్ అప్ పాలసీని తీసుకోవడం ద్వారా మరింత ప్రయోజనం పొందేందుకు వీలుంటుంది. మాక్స్ బూపా, అపోలో మునిచ్, స్టార్ హెల్త్ కంపెనీల పాలసీలు పరిశీలించండి.
పోస్టాఫీసు ఎంఐఎస్‌లో ఇద్దరం కలిపి రూ. 9,00,000/ పొదుపు చేస్తే.. వచ్చే వడ్డీ ఆదాయంపై ఇద్దరూ పన్ను చెల్లించాలా ? తెలియచేయగలరు.
- సాంబశివ రావు
పోస్టాఫీసు ఎంఐఎస్‌పై వచ్చే వడ్డీ ఆదాయం మీద పన్ను మినహాయింపులు ఉండవు. దీని మీద టీడీఎస్ లేకపోయినా మీరు మీ ఆదాయపన్ను రిటర్నులలో ఈ వడ్డీ తెలుపాల్సి ఉంటుంది. స్లాబుకు తగ్గట్టు పన్ను విధిస్తారు.
పీపీఎఫ్ అకౌంట్ కలిగిన బ్యాంక్ దివాలా తీస్తే అందులో ఉన్న మన డబ్బుకు ఎలాంటి భద్రత ఉంటుంది?
- రమేష్
పీపీఎఫ్ ఖాతా బ్యాంకులు అందిస్తున్నప్పటికీ ఈ పథకం మాత్రం పోస్టాఫీసు వారిదే. మీ డబ్బు బ్యాంకులు వారి వద్ద ఉంచరు. వీటిని పోస్టాఫీసుకు బదిలీ చేస్తారు. కాబట్టి, బ్యాంకులకు ఏదైనా జరిగినప్పటికీ పోస్టాఫీసు వద్ద మీ డబ్బు సురక్షితమే.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Viral Video: ఉదయనిధి స్టాలిన్ సమక్షంలోనే పార్టీ కార్యకర్తపై చేయిచేసుకున్న మంత్రి
-
Sports News
Women T20 World Cup: మహిళా సభ్యులతో తొలిసారిగా ప్యానెల్..భారత్ నుంచి ముగ్గురికి చోటు
-
Technology News
Indus Royal Game: వీర్లోక్లో మిథ్‌వాకర్స్ పోరాటం.. దేనికోసం?
-
Viral-videos News
Ranbir Kapoor: అభిమాని సెల్ఫీ కోరిక.. కోపంతో ఫోన్‌ను విసిరేసిన రణ్‌బీర్!
-
General News
‘ట్విటర్ పే చర్చా..’ ఆనంద్ మహీంద్రా, శశి థరూర్ మధ్య ఆసక్తికర సంభాషణ!
-
Politics News
JDU - RJD: జేడీయూ - ఆర్జేడీ మతలబేంటో తెలియాల్సిందే!