Nominee: నామినీని ఎందుకు జాగ్రత్తగా ఎంచుకోవాలి?
బీమా పాలసీలకు, తమ పేరు మీద ఆర్థిక వ్యవహారాలను నిర్వహించేవారికి నామినేషన్ అనేది చాలా కీలకం. నామినీ గురించి కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: మనం చేసే చాలా ఆర్థిక వ్యవహారాలకు నామినీ అవసరం. నామినీని పేర్కొనకపోవడం అంటే సంపదను ప్రమాదంలో పడేయడమే. సంపద సృష్టి అనేది మీ కోసమే కాకుండా మీ ప్రియమైనవారి కోసం సహాయపడే ప్రక్రియ. అందుచేత ఎవరైనా వారి తదనంతరం వారి సంపద సరైన వ్యక్తికి చేరాలంటే నామినీ పేర్కొని తీరాలి. ఒక వ్యక్తి అతడి మరణం తర్వాత తన ఆస్తులను స్వీకరించడానికి అర్హులైన ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులను నియమించడానికి నామినేషన్ అనే కీలకమైన ప్రక్రియను పూర్తిచేయాలి.
నామినీ అవసరం
ఒకరు జీవిత బీమా పాలసీని తీసుకున్నారని అనుకుందాం. అతడి పాలసీలో పేర్కొన్న నామినీ ఆ వ్యక్తి మరణం తర్వాత క్లెయిమ్ మొత్తాన్ని స్వీకరించే వ్యక్తి. అదే విధంగా నామినీ మీ బ్యాంకులో ఎఫ్డీ, ఆర్డీ, సేవింగ్స్ ఖాతా, పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్, స్టాక్స్ మొదలైన వాటిలో మీ తదనంతరం కార్పస్‌ను స్వీకరిస్తారు. అయితే, సరైన నామినీని ఎంచుకోకపోవడం వల్ల మీ సంపద దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. ఒక వ్యక్తి తన ఎఫ్డీలు, సేవింగ్స్ ఖాతాలు, పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్లు, జీవిత బీమా మొదలైన వాటికోసం వేర్వేరు నామినీలను సూచించవచ్చు. అలాగే, ఆస్తి రకాన్ని బట్టి ఒకరు లేదా బహుళ నామినీలను పేర్కొనవచ్చు. బీమా పాలసీలు, మ్యూచువల్ ఫండ్లు వంటి సంస్థలు బహుళ నామినీలను అనుమతిస్తాయి. ఆస్తి యజమాని నిర్వచించిన వాటా ప్రకారం నామినీలు ఆస్తిని స్వీకరిస్తారు.
నామినీ ఎందుకు ముఖ్యం?
నామినీలు మరణించిన యజమాని ఆస్తులకు సంరక్షకులు. కాబట్టి యజమాని మరణించిన తర్వాత నామినీకి అర్హత కలిగిన ఆస్తిని పొందే చట్టపరమైన హక్కు లభిస్తుంది. అయితే, కొన్నిసార్లు నామినీ ఆస్తులకు చట్టపరమైన వారసుడు కాకపోవచ్చు. అప్పుడు వారు నిజమైన చట్టపరమైన వారసుడిని ప్రకటించే వరకు తప్పనిసరిగా ఆస్తికి సంరక్షకులుగా వ్యవహరించాలి. వివిధ రకాల ఆస్తులు, ఖాతాల కోసం వివిధ నామినీలు ఉండవచ్చు. బ్యాంకు ఖాతాలో నామినీని పేర్కొనడం చాలా ముఖ్యం. బ్యాంకు ఖాతాలో సాధారణంగా ఒక నామినీకి మాత్రమే అనుమతి ఉంటుంది. అకాల మరణం తర్వాత మీ పెట్టుబడులను సెటిల్ చేయడంలో నామినీ కీలక పాత్ర పోషిస్తారు.
ఎవరు నామినీ కావచ్చు?
మీరు మీ ఆస్తికి నామినీగా జీవిత భాగస్వామి, బంధువు, తల్లిదండ్రులు, స్నేహితుడు మొదలైన ఏ వ్యక్తినైనా నియమించొచ్చు. మ్యూచువల్ ఫండ్ల విషయంలో గరిష్ఠంగా ముగ్గురు వ్యక్తులను నామినేట్ చేయవచ్చు. ఈ ఫండ్లలో బహుళ స్కీమ్‌లను కలిగి ఉంటే, అన్ని స్కీంలు ఒకే నామినేషన్ వివరాలను కలిగి ఉంటాయి.
నామినీ సమీక్ష
సెటిల్మెంట్ సమయంలో మీ ఆస్తుల్లో అప్డేట్ చేసిన తాజా నామినీ వివరాలు పరిగణిస్తారు. మ్యూచువల్ ఫండ్లు, ఇన్సూరెన్స్, షేర్లు, చిన్న పొదుపు పథకాలు, బ్యాంకు ఖాతాలు, ఎఫ్డీలు మొదలైన మీ అన్ని పెట్టుబడులకు మీరు నామినేషన్ పేర్కొన్నారా లేదా నిర్ధారించుకోండి. మీ ఖాతాల నామినేషన్లను క్రమం తప్పకుండా సమీక్షించండి . అవసరమైనప్పుడు మార్పులు చేయండి. నామినీని కలిగి ఉండడం అనేది చట్టపరమైన వారసుడిని పేర్కొన్నట్టు కాదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
Mutual Funds: స్మాల్ క్యాప్ ఫండ్లపై రాబడులివే
స్మాల్ క్యాప్ ఫండ్లలో రిస్క్ ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్నింటిని ఇక్కడ చూడొచ్చు. -
సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు ప్రయోజనమేనా?
నాన్ లగ్జరీ కారు కొనుగోలు కంటే కొద్దిగా ఎక్కువ ఖర్చు చేస్తే అధునాతన ఫీచర్లు గల సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు చేయొచ్చు. ఇలాంటి కార్ల కొనుగోలుతో ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. -
జీవిత బీమాలో క్లెయిం సెటిల్మెంట్ ఎలా?
జీవిత బీమా క్లెయిమ్స్ సెటిల్మెంట్ అనేది బీమా సంస్థకు సంబంధించిన ముఖ్యమైన సేవల్లో కీలకమైనది. క్లెయిం సెటిల్మెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. -
ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు
ఆరోగ్య బీమా కొనుగోలుకు ఉన్న వయో పరిమితిని ఐఆర్డీఏ తొలగించింది. దీంతో అన్ని వయసుల వారూ బీమా పాలసీని తీసుకునే అవకాశం లభించనుంది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్‌లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు -
సరైన బీమా హామీ మొత్తాన్ని ఎలా ఎంచుకోవాలి?
ప్రస్తుత కాలంలో సంపాదించే ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా తనపై ఆధారపడిన వారు ఉన్నప్పుడు తగిన జీవిత బీమా మొత్తం ఉండడం ఎంతో అవసరం. ఎంత బీమా ఉంటే కుటుంబ సభ్యులకు సరిపోవచ్చో ఇక్కడ చూడండి. -
ఆరోగ్య బీమా రూల్స్‌లో మార్పులు.. పాలసీదారులకు ప్రయోజనం
IRDAI : ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల విషయంలో బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ద్వారా బీమా కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూరనుంది. -
మిడ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఎంతెంత?
దేశీయంగా పెట్టుబడులకు వివిధ మ్యూచువల్ ఫండ్ల పథకాలు ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్ని మిడ్ క్యాప్ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు. -
కొత్త ఏడాదిలో పన్ను విధానం ఎంచుకుంటున్నారా? ఇవి తెలుసుకున్నాకే..!
Income tax: కొత్త ఆర్థిక సంవత్సరంలో వేతన జీవులు పన్ను విధానం యాజమాన్యానికి తెలియజేయాలి. టీడీఎస్ కోసం మీకు నప్పే పన్ను విధానం ఎంచుకోవడం మంచిది. -
పదవీ విరమణ తర్వాత రూ.1 కోటి నిధి సరిపోతుందా?
చాలా మంది పదవీ విరమణ నిధికి రూ.1 కోటి సరిపోతుందని అనుకుంటారు. ఎలాంటి విషయాలు పదవీ విరమణ నిధిని, రాబడిని ప్రభావితం చేస్తాయి. రూ.1 కోటి నిధి సరిపోతుందా? లేదా? ఇక్కడ తెలుసుకోండి.. -
జీవిత బీమా.. అనుబంధ పాలసీలు తీసుకున్నారా?
ఊహించని పరిస్థితుల నుంచి మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు రక్షణ కల్పించేది జీవిత బీమా. సంపాదించే ప్రతి ఒక్కరూ తన ఆర్థిక ప్రణాళికల్లో దీనికి తగిన స్థానం ఇవ్వాల్సిందే. ఆయుర్దాయం పెరుగుతోంది. అదే సమయంలో జీవన శైలీ మారుతోంది. -
లక్ష్య సాధనకు సిప్ మార్గం
స్టాక్ మార్కెట్లో చిన్న మొత్తాలతోనూ మదుపు చేసేందుకు క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) తోడ్పడుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు సిప్ ద్వారా మదుపు చేసే వారు పెరిగారు. యాంఫీ గణాంకాల ప్రకారం చూస్తే.. గత నెలలో దాదాపు 42.87 లక్షల కొత్త సిప్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. -
విహార యాత్రలో ధీమాగా
వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ కాలంలో చల్లని ప్రాంతాలకు వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో చాలామంది విదేశాలకు వెళ్లేవారూ ఉంటారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణాల్లో అనుకోని అవాంతరాలు, అనారోగ్యం వచ్చినప్పుడు తోడుండేలా బీమా తీసుకోవడం మంచిది. -
టర్మ్ బీమా ప్రీమియంలు ఎంతెంత?
చిన్న వయసులోనే జీవిత బీమా తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. వివిధ బీమా సంస్థలు వసూలు చేసే ప్రీమియంలు ఎంతెంతున్నాయో ఇక్కడ చూడండి.
తాజా వార్తలు (Latest News)
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక