‘ఆదిత్య ఎల్‌1 మిషన్‌’కు ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్‌ యంత్ర భాగాలు

ఇస్రో చేపట్టిన మరొక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు అయిన ‘ఆదిత్య ఎల్‌1 మిషన్‌’కు హైదరాబాద్‌కు చెందిన ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్‌ కీలక యంత్ర భాగాలను సరఫరా చేసింది. తద్వారా ఈ ప్రాజెక్టులో  క్రియాశీలక పాత్ర పోషిస్తోంది.

Published : 02 Sep 2023 02:07 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఇస్రో చేపట్టిన మరొక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు అయిన ‘ఆదిత్య ఎల్‌1 మిషన్‌’కు హైదరాబాద్‌కు చెందిన ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్‌ కీలక యంత్ర భాగాలను సరఫరా చేసింది. తద్వారా ఈ ప్రాజెక్టులో  క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. ఆదిత్య ఎల్‌1 ప్రాజెక్టు లాంచ్‌ వెహికల్‌కు పీఎస్‌ఓఎం సిట్‌వీసీ ఇంజెక్టంట్‌ ట్యాంకులు ఈ కంపెనీ సరఫరా చేసింది. పీఎస్‌ఓఎం మోటార్స్‌ ముక్కు కొన(నోస్‌ కోన్‌)కు ఈ ట్యాంకులను బిగిస్తారు. రాకెట్‌ను ప్రయోగించిన తర్వాత దాని ప్రయాణంలో... ప్రధానంగా రాకెట్‌ ఏరోడైనమిక్‌ అవసరాలకు నోస్‌ కోన్‌, దానికి అమర్చిన మోటార్లు క్రియాశీలకమైన పాత్ర పోషిస్తాయి. ఎంతో ముఖ్యమైన ఈ యంత్ర భాగాలను పూర్తి సొంత పరిజ్ఞానంతో, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో తాము తయారు చేసినట్లు ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డి.విద్యాసాగర్‌ తెలిపారు. భవిష్యత్తులో ఇస్రోకు ఇటువంటి ఎన్నో ముఖ్యమైన విడిభాగాలను అందించటానికి సన్నద్ధం అవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆదిత్య ఎల్‌1 ప్రాజెక్టు విజయవంతం అవుతుందని పేర్కొంటూ, ఇస్రో శాస్త్రవేత్తలకు ముందస్తు అభినందనలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని