స్కోరు తగ్గితే.. అంతేనా...
వడ్డీ రేట్లు పెరగడం ప్రారంభించాయి. వచ్చే కొన్ని నెలల్లో ఇవి మరో ఒక శాతం వరకూ పెరిగే అంచనాలూ ఉన్నాయి. బ్యాంకులు రుణగ్రహీతల గత చరిత్ర ఆధారంగా వడ్డీ రేట్లను నిర్ణయించడం ప్రారంభించాయి. మంచి చెల్లింపుల చరిత్ర, క్రెడిట్ స్కోరున్న
వడ్డీ రేట్లు పెరగడం ప్రారంభించాయి. వచ్చే కొన్ని నెలల్లో ఇవి మరో ఒక శాతం వరకూ పెరిగే అంచనాలూ ఉన్నాయి. బ్యాంకులు రుణగ్రహీతల గత చరిత్ర ఆధారంగా వడ్డీ రేట్లను నిర్ణయించడం ప్రారంభించాయి. మంచి చెల్లింపుల చరిత్ర, క్రెడిట్ స్కోరున్న వారికి 0.25శాతం నుంచి 0.50శాతం వరకూ వడ్డీ రేట్లలో రాయితీనిస్తున్నాయి. మరి, ఈ క్రెడిట్ స్కోరు తగ్గితే ఏమవుతుంది. వడ్డీ భారం మోయాల్సిందేనా? దీన్ని పెంచుకునేందుకు ఉన్న మార్గాలేమిటి?
క్రెడిట్ స్కోరును 300 నుంచి 900 పాయింట్ల వరకూ లెక్కిస్తారు. 750 పాయింట్లకు మించి ఉంటే.. మంచి క్రెడిట్ స్కోరుగా పరిగణిస్తారు. మీరు ఆర్థికంగా స్థిరంగా ఉన్నట్లు, రుణాలకు వాయిదాలు, క్రెడిట్ కార్డుల బిల్లులు సకాలంలో చెల్లిస్తున్నట్లు లెక్క అన్నమాట. బ్యాంకులు ఆశించిన స్కోరున్న వారికి రుణాలు లభించడమూ సులువే. తక్కువ పాయింట్లు ఉన్న వారిని బ్యాంకులు అంతగా పట్టించుకోవు. వడ్డీ రేట్లు పెరుగుతున్న సమయంలో రుణ సంస్థలు ఇలాంటి విషయాలను మరీ ఎక్కువగా పట్టించుకుంటాయి.
మరీ తక్కువగా ఉంటే..
క్రెడిట్ స్కోరు 300-550 పాయింట్ల మధ్య ఉంటే.. దాన్ని ‘పూర్’ స్కోరుగా భావిస్తారు. ఇలాంటి స్థితిలో ఉన్నవారు.. వెంటనే జాగ్రత్త పడక తప్పదు. దశల వారీగా స్కోరు పెంచుకునేందుకు ఉన్న మార్గాలను అన్వేషించాలి. ఇది ఒక్క రోజులో అయ్యే పని కాదు. ఆర్థిక క్రమశిక్షణతో కొన్నేళ్లపాటు దీనిని సాధించాల్సి ఉంటుంది.
కారణాలేమిటి?
తగ్గిన స్కోరును పెంచుకోవాలని అనుకున్నప్పుడు ముందుగా అది తగ్గడానికి కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. క్రెడిట్ బ్యూరో లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ అగ్రిగేటర్ల నుంచి ఈ నివేదికను పొందేందుకు వీలుంది. ఈ నివేదికను నిశితంగా పరిశీలించాలి. అప్పుడు ఎక్కడ లోపం ఉందో కనిపెట్టవచ్చు. కొన్నిసార్లు ఒకటికి మించిన కారణాలతో స్కోరు తగ్గుతూ ఉండొచ్చు. ముందుగా వాటిని గుర్తించండి. చాలా సందర్భాల్లో క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో తీర్చలేకపోవడం, రుణ వాయిదాలు చెల్లించలేనప్పుడు స్కోరు వేగంగా పడిపోతుంది. అధిక రుణ వినియోగ నిష్పత్తి, హామీ లేని రుణాల కోసం తరచూ బ్యాంకుల్లో విచారించడం, రుణదాత క్రెడిట్ బ్యూరోలకు తప్పుడు సమాచారం ఇవ్వడం, మీరు ఇతరులకు హామీగా ఉన్నప్పుడు.. వారు సరిగా రుణ వాయిదాలు చెల్లించకపోవడంలాంటి కారణాలతో స్కోరు తగ్గేందుకు అవకాశాలున్నాయి.
ప్రభావం ఏమిటి?
క్రెడిట్ స్కోరు తక్కువగా ఉండటం వల్ల మీ ఆర్థిక ప్రణాళికలపై ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపించే ప్రమాదం ఉంది. కొత్త రుణాలు తీసుకొని, ఏదైనా కొనాలంటే కష్టం కావచ్చు. ఇంటి కోసం లేదా కారు గురించి అప్పు తీసుకోవాలని అనుకున్నప్పుడు బ్యాంకు/ఆర్థిక సంస్థ వడ్డీని పెంచి రుణం ఇస్తామని చెప్పొచ్చు. రుణం కొనసాగుతున్న కాలంలోనూ స్కోరు తగ్గితే.. బ్యాంకు వడ్డీ రేటును పెంచొచ్చు.
అప్పు దొరికే మార్గమే లేదా?
స్కోరు తక్కువగా ఉన్నప్పుడు బ్యాంకుల నుంచి హామీ లేని రుణాలు లభించకపోవచ్చు. అప్పు ఇచ్చినా ముందే అనుకున్నట్లు వడ్డీ భారం అధికంగా ఉంటుంది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీ) నుంచి రుణం తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. సహజంగానే ఇక్కడ వడ్డీ రేట్లు అధికంగా ఉంటాయి. కావాల్సినంత స్కోరు లేనప్పుడు హామీ ఉన్న రుణాలవైపు చూడాలి. స్థిరాస్తులను హామీగా చూపించి రుణం తీసుకోవచ్చు. లేదా ఫిక్స్డ్ డిపాజిట్లను హామీగా ఉంచవచ్చు. చాలా సందర్భాల్లో బంగారాన్ని తాకట్టు పెట్టి, రుణం తీసుకునే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ రుణాలను సకాలంలో చెల్లించడం ద్వారా క్రెడిట్ స్కోరును పెంచుకునేందుకు వీలుంది.
ఇలా చేయొచ్చు..
క్రెడిట్ స్కోరును పెంచుకునేందుకు దశల వారీగా కొన్ని మార్గాలను అనుసరించాలి. ఇప్పటికే ఉన్న రుణాల వాయిదాలను క్రమం తప్పకుండా చెల్లించేలా చూసుకోండి. క్రెడిట్ కార్డుల రుణ వినియోగ పరిమితి నిష్పత్తి 30 శాతం కన్నా తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అవసరం లేకున్నా.. రుణాలకు, కార్డులకు దరఖాస్తు చేసుకోవడం మానుకోవాలి.
* రుణదాత పొరపాటు వల్ల మీ నివేదికలో తప్పు సమాచారం దొర్లితే.. వెంటనే బ్యాంకు/ఎన్బీఎఫ్సీని సంప్రదించండి. సరైన సమాచారాన్ని పంపించాల్సిందిగా కోరాలి.
తక్కువ క్రెడిట్ స్కోరుండటం వల్ల ఆర్థికారోగ్యం దెబ్బతింటుంది. అంతమాత్రాన పూర్తిగా ఆశలు వదులుకోవద్దు. ఆర్థిక అలవాట్లను మార్చుకోవడం, పొదుపును పెంచుకుంటూ.. రుణాల భారాన్ని తగ్గించుకోవడంలాంటి చర్యలతో మళ్లీ మీ స్కోరును గాడిన పెట్టొచ్చు.
- అధిల్ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది. -
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్‌లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
Bank charges: సేవింగ్స్ ఖాతాకు సంబంధించిన పలు సేవలపై విధించే ఛార్జీలను ఐసీఐసీఐ, యెస్ బ్యాంకులు సవరించాయి. మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. -
ఆర్డీలపై వివిధ బ్యాంకులు ఆఫర్ చేసే వడ్డీ రేట్లు ఇవే..
దేశంలో దాదాపు అన్ని బ్యాంకులు రికరింగ్ డిపాజిట్ అందిస్తున్నాయి. ఈ ఆర్డీలపై వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎంతెంత ఉన్నాయో ఇక్కడ చూడండి. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
గృహ రుణాలపై బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు ఇవే..
మెరుగైన క్రెడిట్ స్కోరు ఉన్నవారికి, ఇంటి రుణాలపై వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లను ఇక్కడ చూడొచ్చు. -
క్రెడిట్ కార్డు బాధ్యతగా వాడండి
మీ జేబులో ఉన్న క్రెడిట్ కార్డు.. ఒక అద్భుతమైన ఆర్థిక సాధనం. చేతిలో డబ్బు లేకపోయినా కొనుగోళ్లకు ఇబ్బంది లేకుండా ఇది ఉపయోగపడుతుంది. దీన్ని మీరు సరైన మార్గంలో ఉపయోగిస్తే.. అది మీ కోసం ఎన్నో పనులు చేస్తుంది. -
ఎఫ్డీ రేట్లు పెంచిన బజాజ్ ఫైనాన్స్.. వారికి 8.85% వరకు వడ్డీ
బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచింది. సీనియర్ సిటిజన్లకు గరిష్ఠంగా 8.85 శాతం, సాధారణ పౌరులకు 8.6 శాతం వడ్డీ అందిస్తోంది. -
‘అమృత్ కలశ్’ గడువు మరోసారి పెంపు.. ఎప్పటి వరకంటే?
SBI news: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ‘అమృత్ కలశ్’ డిపాజిట్ పథకం గడువును మరోమారు పొడిగించింది. -
విదేశీ విద్యా రుణాలు, వివిధ అంశాల గురించి తెలుసుకోండి?
విద్యార్థులు విదేశీ చదువుకు..రుణ సంస్థల నుంచి పొందే ఆర్థిక సహాయంతో పాటు కొన్ని ముఖ్యమైన ఇతర అంశాల గురించి తెలుసుకోవాలి, అవేంటో ఇక్కడ చూడండి. -
రుణాలు.. తొందరగా తీర్చేద్దాం
అవసరానికి అప్పు చేయడం కొన్నిసార్లు తప్పకపోవచ్చు. తీసుకున్న రుణాన్ని తొందరగా తీర్చేయడమే ఆర్థిక క్రమశిక్షణ. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు.. ఇలా సులభంగా రుణం దొరికే మార్గాలున్న రోజుల్లో మన వద్ద లేని డబ్బును ఖర్చు చేసేప్పుడు ఆలోచించాల్సిందే. -
రూపే కార్డు వాడుతున్నారా? యూపీఐ యాప్ ద్వారా ఇక EMIగా మార్చుకోవచ్చు!
రూపే క్రెడిట్ కార్డు వాడుతున్న వారికి కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. యూపీఐ యాప్‌లో త్వరలో కొన్ని కొత్త ఫీచర్లు పలకరించబోతున్నాయి. -
బ్యాంకుల్లో లేటెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇవే!
చాలా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందజేస్తున్నాయి. -
డెబిట్ కార్డు ఛార్జీలను పెంచిన ఎస్బీఐ
డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
యాక్సిస్ బ్యాంకు కస్టమర్లు కొందరు తమ క్రెడిట్ కార్డుల్లో అనధికారిక లావాదేవీలు జరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. దీనిపై బ్యాంక్ స్పందించింది. -
Flash Pay: కీ చైన్‌తో పేమెంట్స్.. ఫెడరల్ బ్యాంక్ నుంచి ఫ్లాష్ పే
Federal Bank flash pay: ఫెడరల్ బ్యాంక్ స్మార్ట్ కీ చైన్‌ను తీసుకొచ్చింది. కాంటాక్ట్ లెస్ పేమెంట్ల కోసం దీన్ని వినియోగించుకోవచ్చు. -
పిల్లల పేరిట ఎఫ్డీ
పెట్టుబడికి రక్షణ, రాబడికి హామీ ఉన్న పథకాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ) ముందుంటాయి. పిల్లల చదువులు, ఇతర అవసరాల కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్న తల్లిదండ్రులు వీటికి ప్రాధాన్యం ఇస్తుంటారు -
సిబిల్ నివేదికలో తప్పులుంటే
రుణం తీసుకోవాలంటే.. బ్యాంకులు ముందుగా పరిశీలించేది క్రెడిట్ నివేదికనే. ఇందులో ఎలాంటి తప్పులూ దొర్లకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మనకు అవసరం ఉన్నప్పుడు రుణం కోసం వెళ్తే దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంది. -
Personal Loans: వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయ్?
ప్రస్తుతం అన్ని బ్యాంకులు వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి. వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు ఎంతెంతో ఇక్కడ చూద్దాం... -
Home loan: జీరో ప్రాసెసింగ్ ఫీజు.. 8.3% వడ్డీకే హోమ్‌లోన్
Bank of India home loan offer: బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై వడ్డీ తగ్గించింది. ప్రాసెసింగ్ ఫీజు సైతం రద్దు చేసింది. మార్చి 31 వరకు ఈ ఆఫర్ ప్రకటించింది. -
ప్రత్యేక ఎఫ్డీలను ప్రారంభించిన నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 9.25% వడ్డీ వరకు పొందొచ్చు.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్‌లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్‌పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!