బ్యాలెన్స్‌డ్ ఫండ్లు మంచివేనా?
మా పాప వయసు 8. తన భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా వీలున్నప్పుడల్లా రూ.25వేల చొప్పున మదుపు చేయాలని అనుకుంటున్నాను.
* మా పాప వయసు 8. తన భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా వీలున్నప్పుడల్లా రూ.25వేల చొప్పున మదుపు చేయాలని అనుకుంటున్నాను. దీనికోసం ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి?
ఉమాదేవి
* ముందుగా మీ పాప భవిష్యత్‌కు ఆర్థిక రక్షణ కల్పించేలా కుటుంబ పెద్దపై తగిన మొత్తానికి బీమా పాలసీ తీసుకోండి. పాప చదువు, ఇతర అవసరాలకు డబ్బు జమ చేయాలంటే... క్రమం తప్పకుండా మదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. చిన్న మొత్తాలైనా, నెలనెలా పెట్టుబడి పెట్టడం మంచిది. నెలకు ఎంత మదుపు చేయగలరో చూసుకోండి. ఆ మొత్తాన్ని క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) ద్వారా డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్లకు కేటాయించండి.
* నా వయసు 67. నెలనెలా వడ్డీ వచ్చేలా రూ.10 లక్షలను పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. బ్యాలెన్స్‌డ్ ఫండ్లలో డివిడెండ్ ఆప్షన్ తీసుకుంటే బాగుంటుంది అని చెబుతున్నారు. నిజమేనా? ఏం చేయాలి?
ప్రసాద్
* మీ వయసు దృష్ట్యా పెట్టుబడులపై నష్టభయం లేకుండా చూసుకుంటేనే మంచిది. ఇబ్బందేమీ లేదు అనుకుంటేనే మార్కెట్ ఆధారిత పెట్టుబడులు ఎంచుకోవాలి. కాస్త నష్టభయం భరించగలిగితే బ్యాలెన్స్‌డ్, బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్లలో పెట్టుబడి పెట్టండి. వీటిని మార్కెట్ హెచ్చుతగ్గులు ప్రభావితం చేస్తాయని గమనించాలి. సురక్షిత పథకాలను ఎంచుకోవాలని అనుకుంటే.. పోస్టాఫీసు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీంను పరిశీలించవచ్చు. ఇందులో ప్రస్తుతం 8 శాతం వడ్డీ అందిస్తున్నారు. ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ చెల్లిస్తారు. గరిష్ఠంగా రూ.15లక్షల వరకూ ఇందులో జమ చేసుకోవచ్చు.
* నేను రూ.35 లక్షల గృహరుణం తీసుకోబోతున్నాను. రుణంతో పాటు తప్పనిసరిగా బీమా తీసుకోవాలని బ్యాంకు అంటోంది. ఇది అవసరమా? ఈ పాలసీ మంచిదేనా?
రాజేశ్
* గృహరుణంలాంటి దీర్ఘకాలిక రుణాలు తీసుకునేటప్పుడు బీమా పాలసీలతో రక్షణ ఏర్పాటు చేసుకోవడం మంచిదే. కొన్ని బ్యాంకులు గృహరుణం తీసుకునే వారికి లోన్ కవర్ టర్మ్ పాలసీలను తప్పనిసరిగా అందిస్తుంటాయి. కొన్ని ఈ పాలసీ గురించి పట్టించుకోవు. మీరు రుణానికి అనుబంధంగా పాలసీ తీసుకుంటే.. ‘ప్లెయిన్ మార్టిగేజ్ ఇన్సూరెన్స్’ను తీసుకోండి. కొన్ని సందర్భాల్లో వివిధ రైడర్లతో పాలసీలను అందిస్తుంటారు. ఈ తరహా పాలసీలకు ప్రీమియం అధికంగా ఉంటుంది. ఏక మొత్తంలో ప్రీమియం చెల్లించి పాలసీని తీసుకోండి. రుణం తీరేంత వరకూ రక్షణ కల్పించేలా చూసుకోండి.
* పన్ను ఆదా కోసం మూడేళ్ల క్రితం ఎండోమెంట్ జీవిత బీమా పాలసీ తీసుకున్నాను. ఏడాదికి రూ.40వేల ప్రీమియం. ఇప్పుడు నేను ఉద్యోగం మానేశాను. ఈ పాలసీని రద్దు చేసుకోవచ్చా?
కృష్ణ
* కేవలం ఆదాయపు పన్ను మినహాయింపు లక్ష్యంగా జీవిత బీమా పాలసీ తీసుకోవడం సరికాదు. ఆర్థిక రక్షణకు అవసరమైన మేరకు పాలసీ ఉండాలి. సాధారణంగా ఎండోమెంట్ పాలసీలకు మూడేళ్ల వరకూ ప్రీమియం చెల్లిస్తే ఆ పాలసీని స్వాధీనం చేయొచ్చు లేదా పెయిడప్ పాలసీగా మార్చుకునే వీలుంటుంది. పెయిడప్ చేస్తే చెల్లించిన ప్రీమియం ఆధారంగా పాలసీ విలువ తగ్గుతుంది. వ్యవధి తీరిన తర్వాత నిబంధనల మేరకు ఆ మొత్తం చెల్లిస్తారు. పాలసీని కొనసాగించడం ఇష్టం లేకపోతే స్వాధీనం చేయండి. ఎంత మొత్తం వెనక్కి వస్తుందో బీమా సంస్థను సంప్రదించి తెలుసుకోండి.
తుమ్మ బాల్‌రాజ్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
wWBC: మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో లవ్లీనాకు స్వర్ణం
-
Movies News
Smriti Irani: ప్రెగ్నెంట్ అని తెలీదు.. షూట్ వల్ల అబార్షన్ అయ్యింది: స్మృతి ఇరానీ
-
Sports News
Nikhat Zareen: చాలా హ్యాపీగా ఉంది.. తర్వాతి టార్గెట్ అదే: నిఖత్ జరీన్
-
Politics News
Akhilesh: దేశంలో ప్రజాస్వామ్యం మనుగడపైనే ఆందోళన : అఖిలేష్
-
India News
Anand Mahindra: ‘సండే సరదా.. నేను ఆ విషయాన్ని నేను మర్చిపోతా’
-
World News
USA: భారత సంతతి చిన్నారి మరణం.. నిందితుడికి 100 ఏళ్ల జైలు శిక్ష