Gold price: నాలుగు నెలల గరిష్ఠానికి బంగారం ధర

Gold price: బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల పసిడి ధర ఒకేరోజు 750 మేర పెరిగింది. వెండి సైతం కిలో రూ.500 మేర ప్రియమైంది.

Updated : 20 Oct 2023 18:20 IST

దిల్లీ: దేశీయంగా బంగారం ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.750 పెరిగి రూ.61,650కు చేరింది. అంతర్జాతీయ భౌగోళిక పరిణామాల నేపథ్యంలో డిమాండ్‌ పెరగడమే ఇందుకు కారణం. గత ట్రేడింగ్‌ సెషన్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.60,900 వద్ద ముగిసింది. వెండి సైతం కిలో రూ.500 పెరిగి రూ.74,700కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరగడంతో దేశీయంగానూ వీటి ధరలు పెరిగాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ కమొడిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర ప్రస్తుతం 1980 డాలర్లు ఉండగా.. ఔన్సు వెండి 23.80 డాలర్లుగా ఉంది. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య నెలకొన్న యుద్ధం వేళ సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించి మదుపరులు బంగారం వైపు మొగ్గు చూపడమే కారణమని పేర్కొన్నారు. దీంతో బంగారం ధర నాలుగు నెలల గరిష్ఠానికి చేరిందని తెలిపారు.

గమనిక: అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. ప్రాంతం బట్టి కూడా ధరల్లో మార్పు ఉంటుంది. సరైన ధర కోసం దగ్గర్లోని బంగారం దుకాణదారుడిని సంప్రదించండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని