Hero Mavrick 440: హీరో నుంచి ఖరీదైన బైక్‌.. మేవ్రిక్‌ 440 విశేషాలివీ..!

Hero Mavrick 440: హీరో మోటోకార్ప్‌ మేవ్రిక్‌ 440 బైక్‌ను ఆవిష్కరించింది. 440 సీసీ సెగ్మెంట్‌లో ఈ బైక్‌ను తీసుకొచ్చింది. ధర ఎంతనేది వెల్లడించలేదు.

Updated : 23 Jan 2024 19:12 IST

Hero Mavrick 440 | ఇంటర్నెట్‌ డెస్క్‌: గత కొన్ని రోజులుగా ఊరిస్తున్న మేవ్రిక్‌ 440 (Hero Mavrick 440 ) మోటార్‌ సైకిల్‌ను ఎట్టకేలకు హీరో మోటోకార్ప్‌ (Hero motocorp) ఆవిష్కరించింది. హీరో వరల్డ్‌ పేరిట నిర్వహించిన ఈవెంట్‌లో మంగళవారం ఈ బైక్‌ను పరిచయం చేసింది. హీరో ఇప్పటివరకు లాంచ్‌ చేసిన వాటిలో ఇదే ఖరీదైన బైక్‌ కానుంది. దీంతోపాటు హీరో ఎక్స్‌ట్రీమ్‌లో 125సీసీ బైక్‌ను కూడా లాంచ్‌ చేసింది.

హీరో మేవ్రిక్‌ 440 బుకింగ్స్‌ ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నాయి. బైక్‌ ధర సైతం అదే సమయంలో వెల్లడించనున్నారు. దీని ధర సుమారు రూ.2.49 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌) ఉండొచ్చని అంచనా. ఏప్రిల్‌ నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. గతేడాది హీరో- హార్లే భాగస్వామ్యంలో వచ్చిన హార్లేడేవిడ్‌సన్‌ ఎక్స్‌ 440 ప్లాట్‌ఫామ్‌పైనే కొత్త మేవ్రిక్‌ 440ని తీసుకొచ్చారు.

ఎల్‌ఐసీ నుంచి కొత్త పెన్షన్‌ ప్లాన్‌.. పూర్తి వివరాలు ఇవే..!

ఈ బైక్‌ ఫీచర్ల విషయానికొస్తే.. అతిపెద్ద ఫ్యూయల్ ట్యాంక్‌, సింగిల్‌ పీస్‌ లాంగ్‌ సీట్‌, హెచ్‌ ఆకారంలో కూడిన ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్‌, వృత్తాకారంలో చిన్నపాటి ఇండికేటర్లను ఇచ్చారు. వెనక భాగం మాత్రం హార్లే డేవిడ్‌సన్‌ ఎక్స్‌440 మాదిరిగానే ఉంది. ముందువైపు టెలీస్కోపిక్‌ సస్పెన్షన్‌, వెనకవైపు డ్యూయల్‌ షాకర్స్‌ ఇచ్చారు. రెండువైపులా డిస్క్‌బ్రేక్‌ ఇచ్చారు. డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్‌ చేసుకునేందుకు వీలుగా బ్లూటూత్‌ కనెక్టవిటీ, కాల్‌/ టెక్ట్స్‌ నోటిఫికేషన్‌ అలర్ట్స్‌, టర్న్‌ బై టర్న్‌ నావిగేషన్‌ సిస్టమ్‌ ఇందులో ఉన్నాయి.

హార్లే డేవిడ్‌సన్‌ తరహాలో ఇందులోనూ 440 సీసీ ఆయిల్‌ కూల్డ్‌ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ అమర్చారు. 6 స్పీడ్‌ గేర్‌బాక్స్‌ ఉంది. ఈ ఇంజిన్‌ 36 ఎన్‌ఎం పీక్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ20 పెట్రోల్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఈ బైక్‌ ట్రయంఫ్‌ స్క్రాంబ్లర్‌ 400, స్పీడ్‌ 400, హార్లే ఎక్స్‌440, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌, క్లాసిక్‌ 350, హోండా సీబీ 350 బైక్స్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది.

ఎక్స్‌ట్రీమ్‌ 125ఆర్‌

హీరో వరల్డ్‌ వేదికగా 125సీసీ సెగ్మెంట్‌లో హీరో మోటోకార్ప్‌ ఎక్స్‌ట్రీమ్‌ 125ఆర్‌ను ఆవిష్కరించింది. ఇది ఇంజిన్‌ బ్యాలెన్సర్‌ టెక్నాలజీపై (EBT) ఈ బైక్‌ను తీసుకొచ్చినట్లు తెలిపింది. ఈ కొత్త టెక్నాలజీ స్మూత్‌ పవర్‌, ఇన్‌స్టంట్‌ టార్క్‌ను విడుదల చేస్తుందని పేర్కొంది. కొత్త ఎక్స్‌ట్రీమ్‌ బ్లూ, ఫైర్‌స్ట్రామ్‌ రెడ్‌, స్టాలియన్‌ బ్లాక్‌ రంగుల్లో ఐబీఎస్‌, ఏబీఎస్‌ వేరియంట్లలో లభిస్తుంది. ఫిబ్రవరి 20 నుంచి ఇది అందుబాటులోకి రానుంది. దీని ధరను రూ.95వేలు (ఎక్స్‌షోరూమ్‌ దిల్లీ)గా నిర్ణయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు