ఆపదలో..భరోసాగా
చిన్న ప్రమాదం మొత్తం కుటుంబాన్ని ఆర్థికంగానూ, మానసికంగానూ కుదిపేస్తుంది. అందుకే, మనతోపాటు మన కుటుంబానికీ తగిన ఆర్థిక రక్షణ కల్పించేలా ఏర్పాటు చేసుకోవాలి.
చిన్న ప్రమాదం మొత్తం కుటుంబాన్ని ఆర్థికంగానూ, మానసికంగానూ కుదిపేస్తుంది. అందుకే, మనతోపాటు మన కుటుంబానికీ తగిన ఆర్థిక రక్షణ కల్పించేలా ఏర్పాటు చేసుకోవాలి. దీనికోసం వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని పరిశీలించవచ్చు.
కరోనా వచ్చిన తర్వాత చాలామంది సొంత వాహనాల్లో ప్రయాణాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. రోడ్లపై వాహనాల సంఖ్య పెరిగింది. రోడ్డు ప్రమాదాలు సైతం అధికంగా అవుతున్న విషయాన్ని గమనిస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో అనుకోని దుర్ఘటనల నుంచి మనల్ని మనం ఆర్థికంగా రక్షించుకోవడంతోపాటు, కుటుంబానికి భరోసా కల్పించడం చాలా ముఖ్యమైన అంశం. దీనికోసం ఉపయోగపడేదే వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ. ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఇది ఆర్థికంగా రక్షణనిస్తుంది.
వాహనాల్లో ప్రయాణించేటప్పుడు అనుకోకుండా ఏదైనా ప్రమాదం ఎదురవ్వవచ్చు. వాహనంలోని ప్రయాణికులు మరణించవచ్చు. ఒక్కోసారి పూర్తి వైకల్యానికి గురవుతారు. లేదా పాక్షిక వైకల్యం సంభవిస్తుంటుంది. ఇలాంటి ఆపద సమయాల్లో వ్యక్తిగత ప్రమాద బీమా జరిగిన నష్టంలో ఆర్థిక అంశాలను చూసుకుంటుంది. ముఖ్యంగా ప్రమాదం వల్ల పాలసీదారుడికి ఏదైనా అయితే, కుటుంబానికి ఆర్థిక చిక్కులు ఎదురవ్వకుండా చూసుకుంటుంది. ఈ పాలసీని కొనుగోలు చేసేందుకు 18-65 ఏళ్ల వారు అర్హులు.
ప్రమాదం జరిగిన తర్వాత వ్యక్తికి కొన్నాళ్లపాటు ఆదాయం ఆగిపోవచ్చు. చికిత్స ఖర్చు రుణాలు ఈఎంఐలు, ఇతర అవసరాలు తీరేలా వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ నుంచి ఏక మొత్తంగా కొంత డబ్బు వస్తుంది. దాన్ని అవసరాలకు వాడుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ మధ్య బీమా కంపెనీలు సాహస విహార యాత్రలనూ ఈ పాలసీల పరిధిలోకి తీసుకొచ్చాయి.
* మరణిస్తే: ప్రమాదంలో పాలసీదారుడు మరణిస్తే.. యాక్సిడెంటల్ డెత్ కవరేజీ కింద నామినీ లేదా చట్టబద్ధ వారసులకు హామీ మొత్తం లభిస్తుంది.
* శాశ్వత పూర్తి వైకల్యం: ఒకవేళ వ్యక్తికి వైకల్యం సంభవించి, ఇక ఏ చికిత్స ద్వారా అతను/ఆమె కోలుకోలేని స్థితికి చేరితో పాలసీలో ఇచ్చిన హామీ మొత్తం చేతికి అందుతుంది. కొన్ని బీమా సంస్థలు హామీ మొత్తానికి రెట్టింపునూ అందిస్తున్నాయి.
* శాశ్వత పాక్షిక వైకల్యం: ప్రమాదం వల్ల పాలసీదారుడు శరీరంలో ఏదైనా భాగాన్ని లేదా చూపు, వినికిడి కోల్పోవడం వంటి వాటితో బయటపడితే చికిత్సకు అయ్యే ఖర్చును పాలసీలోని నిబంధనల ప్రకారం అందిస్తారు. వ్యక్తి స్థితిని బట్టి, హామీ మొత్తంలో 25-90 శాతం వరకూ పొందే అవకాశం ఉంది.
* తాత్కాలిక చికిత్స: ఒక్కోసారి పెద్దగా గాయాలేమీ కానప్పటికీ ప్రమాదానికి గురైన వారికి వైద్యులు విశ్రాంతిని సూచిస్తుంటారు. ఇలాంటప్పుడు సదరు వ్యక్తి ఆదాయం కోల్పోవచ్చు. అలాగే ఆ సమయంలో అయ్యే ఖర్చులకు డబ్బు అవసరం అవుతుంది. అవి కవర్ అయ్యేలా పాలసీలోని నిబంధనల ప్రకారం రోజూ లేదా వారం చొప్పున కొంత మొత్తం బీమా సంస్థ అందిస్తుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Rahul Gandhi: రాహుల్ సభలో ఖలిస్థానీ మద్దతుదారుల హల్చల్..
-
General News
Registrations: తెలంగాణలో నిలిచిన కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు
-
India News
గిడ్డంగుల సామర్థ్యం పెంపునకు ₹లక్ష కోట్లు.. కేబినెట్ ఆమోదం
-
Politics News
Nara Lokesh: రాష్ట్ర వ్యాప్తంగా చేనేతను దత్తత తీసుకుంటా: నారా లోకేశ్
-
General News
TTD: జమ్మూకశ్మీర్లో జూన్ 8న శ్రీవారి ఆలయ సంప్రోక్షణ: తితిదే
-
Sports News
ICC: లాహోర్లో ఐసీసీ ఛైర్మన్.. ప్రపంచకప్లో పాక్ ఆడే అంశం ఓ కొలిక్కి వచ్చేనా..?