PAN Card: ఈ ట్రిక్ తెలిస్తే పాన్ కార్డు నంబర్‌ను అస్సలు మర్చిపోరు!
How to Remember PAN card Number: పాన్ కార్డు నంబర్‌ను సులువుగా గుర్తుంచుకోవాలంటే దానిపై ఉన్న అక్షరాల, అంకెల వెనుక మర్మం తెలియాలి. అప్పుడే సులువుగా గుర్తుంచుకోవడం సాధ్యమవుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: చాలా మందికి 10 అంకెల ఫోన్ నంబర్ గుర్తుంటుంది. కేవలం మనదే కాదు.. ఇతరుల ఫోన్ నంబర్లు సైతం గుర్తుంటాయి. 12 అంకెల ఆధార్ కార్డూ గుర్తుంటుంది. కానీ, పాన్ కార్డు (Pan card) నంబర్ మాత్రం గుర్తుండదు. అంకెలు, అక్షరాలతో కలిపి 10 అక్షరాలే ఉన్నా.. దీన్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకోవడం కష్టంగానే ఉంటుంది. పైగా చూసి రాయాల్సిన చోటా ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతుంటారు. నంబర్‌లో సున్నా, ఆంగ్ల అక్షరం ఓ ఉన్నప్పుడు ఎక్కువగా గందరగోళానికి గురవుతుంటారు. ఈ సింపుల్ ట్రిక్ తెలిస్తే మీ పాన్ కార్డు నంబర్‌ను ఎప్పుడూ మరిచిపోరు. ఎప్పుడూ గందరగోళానికి గురికారు.
పాన్ కార్డుపై అంకెలు, అక్షరాలతో కూడిన 10 అంకెల నంబర్ ఉంటుంది. ఆ పది నంబర్‌ను మీకు కేటాయించడం వెనుక పెద్ద కారణమే ఉంటుంది. అందులో మన వ్యక్తిగత సమాచారం కూడా దాగి ఉంటుంది. యుటీఐ లేదా ఎన్ఎస్‌డీఎల్ (NSDL) ద్వారా ఒక క్రమంలో పాన్‌ను వ్యక్తలకు ఆదాయ పన్ను శాఖ జారీ చేస్తుంది. మీ మొబైల్ నంబర్ మాదిరిగా పాన్ నంబర్ కంప్యూటర్ జనరేటెడ్ కాదు. పాన్ కార్డులో మొదటి ఐదు అక్షరాలు ఆంగ్ల అక్షరాలు, తర్వాత నాలుగు అంకెలు, చివర్లో మళ్లీ ఓ ఆంగ్ల అక్షరం ఉంటుది. చాలా మంది ఈ విషయం తెలీక ‘సున్నా’కి, ‘ఓ’ విషయంలో పొరపడుతుంటారు. ఈ ట్రిక్ తెలిశాక ఆ పొరపాటు పునరావృతం కాదు.
పాన్‌లో మొదటి మూడు అక్షరాలు AAA to ZZZ సిరీస్‌లో ఉంటాయి. నాలుగో అక్షరానికి మాత్రం ప్రత్యేకత ఉంటుంది. ఆదాయ పన్ను శాఖ దృష్టిలో మీరు ఏంటనేది ఆ అక్షరం తెలియజేస్తుంది. వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులందరికీ ‘P’ అక్షరాన్ని కేటాయిస్తారు. ఇక ఐదో అక్షరం మీ ఇంటి పేరు మొదటి అక్షరాన్ని తెలియజేస్తుంది. కావాలంటే మీరు కార్డును ఓ సారి గమనించండి. వ్యక్తులు కాకపోతే పాన్‌కార్డు హోల్డర్ పేరులోని మొదటి అక్షరం ఉంటుంది. ఆ తర్వాత నాలుగు అంకెలు 0001 నుంచి 9999 మధ్య ఉంటాయి. పాన్ కార్డుపై చివర్లో ఎప్పుడూ అక్షరమే ఉంటుంది. ఈ విషయాలను గుర్తుంచుకుంటే ఎప్పుడూ మీ పాన్ సంఖ్యను మరిచిపోరు.
నాలుగో అక్షరం ఎవరికి ఏది?
- P- అంటే వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుడు
- C- కంపెనీ
- H- హిందూ అవిభాజ్య కుటుంబం (HUF)
- A- వ్యక్తులు లేదా సంస్థల బృందం (అసోసియేషన్ పర్సన్స్-ఏఓపీ)
- B- వ్యక్తుల బృందం (BOI)
- G- ప్రభుత్వ ఏజెన్సీ
- J- ఆర్టిఫిషియల్ జ్యురిడికల్ పర్సన్
- L- లోకల్ అథారిటీ
- F- సంస్థ లేదా పరిమిత భాగస్వామ్య సంస్థ
- T - ట్రస్ట్
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
AP Assembly: సభాపతి స్థానాన్ని అగౌరవపరిస్తే సస్పెండ్ అయినట్లే.. రూలింగ్ ఇచ్చిన స్పీకర్ తమ్మినేని
-
India News
Property: ఏనుగుల కోసం రూ.5 కోట్ల ఆస్తి
-
India News
మహిళలకు ప్రతీనెలా రూ.వెయ్యి పంపిణీ
-
India News
Lottery: సినీ నటి ఇంట్లో సహాయకుడు.. ఇప్పుడు కోటీశ్వరుడు
-
India News
క్యాన్సర్, అధిక రక్తపోటుకు అల్లోపతిలో చికిత్స లేదు: బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
Politics News
కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు