ITR: పన్ను ఆదాకోసం చూస్తున్నారా.. అందుబాటులో ఉన్న పథకాలివే..
ప్రభుత్వం కొన్ని పథకాలకు ఆదాయపన్ను మినహాయింపులను అందజేస్తుంది. అలాంటి పథకాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి సంవత్సరం పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయ పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆదాయ పన్ను రిటర్నుల్లో మీ వార్షిక ఆదాయ సమాచారంతో పాటు మీరు ఫైల్ చేయాల్సిన పన్నులు కూడా ఉంటాయి. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని వివిధ సెక్షన్ల కింద, భారత ప్రభుత్వం కొన్ని పన్ను రాయితీలు, మినహాయింపులను అనుమతించింది. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ప్రజలను పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించడం.
పన్ను మినహాయింపు పథకాలు
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద భారత ప్రభుత్వం కొన్ని పథకాల్లో పెట్టుబడి పెట్టిన మొత్తంపై పన్ను మినహాయింపులను అనుమతిస్తుంది. మీరు ఈ స్కీమ్‌ల్లో పెట్టిన పెట్టుబడులకు గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేయొచ్చు. అటువంటి కొన్ని పన్ను ఆదా పథకాలు కింద ఉన్నాయి..
- పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF)
- ఉద్యోగుల భవిష్య నిధి(EPF)
- ఈక్విటీ లింక్ట్ సేవింగ్స్ స్కీమ్(ELSS)
- నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS)
- సుకన్య సమృద్ధి యోజన(SSY)
- సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్(SCSS)
- నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు(NSC)
- జీవిత బీమా పాలసీ ప్రీమియంలు
- 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలపరిమితి గల ఎఫ్డీలు
- ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లు
పైన పేర్కొన్న పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను ఆదా చేయడమే కాకుండా, దీర్ఘకాలంలో మీ సంపదను కూడా వృద్ధి చేసుకోవచ్చు. ఆస్తి కొనుగోలుపై వర్తించే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలపై కూడా పన్ను మినహాయింపు పొందొచ్చు. ఎన్‌పీఎస్‌లో సెక్షన్ 80సి ద్వారానే కాకుండా అదనంగా మరో రూ.50 వేలు మదుపు చేస్తే సెక్షన్ 80CCD 1(B) ద్వారా మినహాయింపు పొందే వీలుంది.
ఆరోగ్యబీమా
ఆరోగ్య బీమా పాలసీలను కొనుగోలు చేయడం కూడా పన్ను ఆదా చేయడంలో మీకు సహాయపడుతుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80డి కింద, పన్ను చెల్లింపుదారుడు తనకు, జీవిత భాగస్వామికి, తనపై ఆధారపడిన పిల్లలకు ఆరోగ్య బీమా ప్రీమియంలను చెల్లించడం ద్వారా రూ. 25,000 వరకు మినహాయింపును పొందవచ్చు. అదే సెక్షన్ కింద, సీనియర్ సిటిజన్ అయితే రూ. 50,000 వరకు పన్ను మినహాయింపును పొందొచ్చు. మీరు 60 ఏళ్లు పైబడిన మీ తల్లిదండ్రుల కోసం ఆరోగ్య బీమాను కొనుగోలు చేస్తే.. మరో రూ.50,000 వరకు మినహాయింపు క్లెయిమ్ చేయొచ్చు. కుటుంబం అంతటా సీనియర్ సిటిజన్లయితే రూ.1 లక్ష వరకు పన్ను మినహాయింపును పొందే అవకాశం ఉంది.
రుణంపై పన్ను ప్రయోజనాలు
గృహ రుణం: మీరు ఏదైనా బ్యాంక్ లేదా నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సంస్థ నుంచి గృహ రుణాన్ని తీసుకుంటే, మీ రుణంపై వడ్డీ, అసలు(ప్రిన్సిపల్) మొత్తానికి సంబంధించి మినహాయింపులను క్లెయిమ్ చేయడానికి అర్హత ఉంటుంది. గృహ రుణ వడ్డీకి సంబంధించి సెక్షన్ 24 కింద గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు, అసలుకు సంబంధించి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద రూ.1.50 లక్షల వరకు మినహాయింపును అనుమతిస్తుంది.
విద్యా రుణం: సెక్షన్ 80E కింద విద్యా రుణానికి చెల్లించే వడ్డీపై పన్ను ప్రయోజనం పొందొచ్చు. వడ్డీ మినహాయింపుపై పరిమితి లేదు.
నిర్దిష్ట పన్ను విధానాన్ని ఎంచుకోవాలి
ప్రస్తుత కాలంలో భారతీయ పౌరులకు 2 పన్ను విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో మీరు వీటిలో దేనినైనా ఎంచుకోవచ్చు. కానీ గరిష్ఠ పన్ను ఆదా కోసం, తగిన పన్ను విధానాన్ని ఎంచుకోవడం ముఖ్యం. కొత్త పన్ను విధానం తక్కువ పన్ను స్లాబ్ రేట్లను ప్రతిపాదించింది. అయితే, ఇది పన్ను మినహాయింపులను అనుమతించదు. కాబట్టి, మీరు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపులను కోరుతున్నట్లయితే, మీరు పాత పన్ను విధానాన్ని అనుసరించడం మేలు. మినహాయింపులు తక్కువ ఉన్నా, అసలు లేకపోయినా మీరు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు.
ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు నిర్దేశిత సమయంలో చేయాలి. ఐటీఆర్ ఫైల్ చేసేవారు ప్రతి సంవత్సరం జులై 31 లేదా ఆదాయపు పన్నుశాఖ పేర్కొన్న తేదీలోపు ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయాలి. పేర్కొన్న వ్యవధిలో ఐటీఆర్‌ను ఫైల్ చేయడంలో విఫలమైతే జరిమానా చెల్లించవలసి ఉంటుంది.
చివరిగా: చాలా మంది ఆదాయ పన్ను ఆదా చేసే ప్రయత్నంలో ఆర్థిక సంవత్సరం చివరిలో పన్ను ఆదా పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. దీనివల్ల గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి, ఈ పెట్టుబడులు ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే మొదలు పెట్టడం మంచిది. మీరు తప్పనిసరిగా అన్ని పన్ను ఆదా పెట్టుబడి ఎంపికల గురించి తెలుసుకోవాలి. మీకు తగిన పథకాల్లో మాత్రమే పెట్టుబడి పెట్టాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా.. ఏ వయసులోనైతే మేలు..?
ఒక వ్యక్తి యుక్త వయసులోనే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం వల్ల ప్రీమియం తగ్గింపు సహా అనేక ప్రయోజనాలుంటాయి. అవేంటో తెలుసుకోండి.. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
Mutual Funds: స్మాల్ క్యాప్ ఫండ్లపై రాబడులివే
స్మాల్ క్యాప్ ఫండ్లలో రిస్క్ ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్నింటిని ఇక్కడ చూడొచ్చు. -
సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు ప్రయోజనమేనా?
నాన్ లగ్జరీ కారు కొనుగోలు కంటే కొద్దిగా ఎక్కువ ఖర్చు చేస్తే అధునాతన ఫీచర్లు గల సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు చేయొచ్చు. ఇలాంటి కార్ల కొనుగోలుతో ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. -
జీవిత బీమాలో క్లెయిం సెటిల్మెంట్ ఎలా?
జీవిత బీమా క్లెయిమ్స్ సెటిల్మెంట్ అనేది బీమా సంస్థకు సంబంధించిన ముఖ్యమైన సేవల్లో కీలకమైనది. క్లెయిం సెటిల్మెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. -
ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు
ఆరోగ్య బీమా కొనుగోలుకు ఉన్న వయో పరిమితిని ఐఆర్డీఏ తొలగించింది. దీంతో అన్ని వయసుల వారూ బీమా పాలసీని తీసుకునే అవకాశం లభించనుంది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్‌లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు -
సరైన బీమా హామీ మొత్తాన్ని ఎలా ఎంచుకోవాలి?
ప్రస్తుత కాలంలో సంపాదించే ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా తనపై ఆధారపడిన వారు ఉన్నప్పుడు తగిన జీవిత బీమా మొత్తం ఉండడం ఎంతో అవసరం. ఎంత బీమా ఉంటే కుటుంబ సభ్యులకు సరిపోవచ్చో ఇక్కడ చూడండి. -
ఆరోగ్య బీమా రూల్స్‌లో మార్పులు.. పాలసీదారులకు ప్రయోజనం
IRDAI : ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల విషయంలో బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ద్వారా బీమా కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూరనుంది. -
మిడ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఎంతెంత?
దేశీయంగా పెట్టుబడులకు వివిధ మ్యూచువల్ ఫండ్ల పథకాలు ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్ని మిడ్ క్యాప్ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు. -
కొత్త ఏడాదిలో పన్ను విధానం ఎంచుకుంటున్నారా? ఇవి తెలుసుకున్నాకే..!
Income tax: కొత్త ఆర్థిక సంవత్సరంలో వేతన జీవులు పన్ను విధానం యాజమాన్యానికి తెలియజేయాలి. టీడీఎస్ కోసం మీకు నప్పే పన్ను విధానం ఎంచుకోవడం మంచిది. -
పదవీ విరమణ తర్వాత రూ.1 కోటి నిధి సరిపోతుందా?
చాలా మంది పదవీ విరమణ నిధికి రూ.1 కోటి సరిపోతుందని అనుకుంటారు. ఎలాంటి విషయాలు పదవీ విరమణ నిధిని, రాబడిని ప్రభావితం చేస్తాయి. రూ.1 కోటి నిధి సరిపోతుందా? లేదా? ఇక్కడ తెలుసుకోండి.. -
జీవిత బీమా.. అనుబంధ పాలసీలు తీసుకున్నారా?
ఊహించని పరిస్థితుల నుంచి మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు రక్షణ కల్పించేది జీవిత బీమా. సంపాదించే ప్రతి ఒక్కరూ తన ఆర్థిక ప్రణాళికల్లో దీనికి తగిన స్థానం ఇవ్వాల్సిందే. ఆయుర్దాయం పెరుగుతోంది. అదే సమయంలో జీవన శైలీ మారుతోంది. -
లక్ష్య సాధనకు సిప్ మార్గం
స్టాక్ మార్కెట్లో చిన్న మొత్తాలతోనూ మదుపు చేసేందుకు క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) తోడ్పడుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు సిప్ ద్వారా మదుపు చేసే వారు పెరిగారు. యాంఫీ గణాంకాల ప్రకారం చూస్తే.. గత నెలలో దాదాపు 42.87 లక్షల కొత్త సిప్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. -
విహార యాత్రలో ధీమాగా
వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ కాలంలో చల్లని ప్రాంతాలకు వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో చాలామంది విదేశాలకు వెళ్లేవారూ ఉంటారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణాల్లో అనుకోని అవాంతరాలు, అనారోగ్యం వచ్చినప్పుడు తోడుండేలా బీమా తీసుకోవడం మంచిది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్‌కు నో ఛాన్స్.. ఈ లఖ్‌నవూ స్టార్‌కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?