Yamaha: ‘ఫాసినో’ మోడల్‌ సహా.. 3 లక్షల ద్విచక్ర వాహనాల రీకాల్‌..!

యమహా మోటార్‌ ఇండియా దాదాపు మూడు లక్షల ద్విచక్ర వాహనాలను రీకాల్‌ చేసింది. బ్రేక్‌ లివర్‌ లోపాలను సరిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Published : 15 Feb 2024 23:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ద్విచక్ర వాహనాల సంస్థ ‘యమహా మోటార్‌ ఇండియా (Yamaha Motor India)’ దాదాపు మూడు లక్షల ద్విచక్ర వాహనాలను రీకాల్‌ చేసింది. ‘రే జడ్‌ఆర్‌ 125 ఎఫ్‌ఐ-హైబ్రిడ్‌ (RayZR 125 Fi Hybrid)’, ‘ఫాసినో 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్‌ (Fascino 125 Fi Hybrid)’ వాహనాల్లోని బ్రేక్‌ లివర్‌ లోపాలను సరిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

స్కూటర్‌ను అతికిస్తే ఆటో రిక్షా.. స్టార్టప్‌ వినూత్న ఆవిష్కరణ!

2022 జనవరి 1- 2024 జనవరి 4వ తేదీ మధ్యకాలంలో తయారైన ఈ స్కూటర్లను మరమ్మతులకు పిలుస్తున్నట్లు చెప్పింది. ఉత్పత్తుల విషయంలో నాణ్యత, భద్రతా ప్రమాణాలకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించింది. రీప్లేస్‌మెంట్ విడిభాగాన్ని సంబంధిత వినియోగదారులకు ఉచితంగా అందజేస్తామని పేర్కొంది. పూర్తి వివరాలకు సంస్థ వెబ్‌సైట్‌, లేదా సమీప యమహా సర్వీస్ సెంటర్‌ను సంప్రదించాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని