iPhone 13: రూ.40 వేల ధరకే ఐఫోన్‌ 13.. అమెజాన్‌ ప్రత్యేక సేల్‌ డీల్‌!

iPhone 13: గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ (Great Indian Festival 2023 Sale)లో భాగంగా అమెజాన్‌ వివిధ యాపిల్ ఉత్పత్తులపై ఆఫర్లను ప్రకటించింది.

Published : 02 Oct 2023 16:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పండగ సీజన్‌ నేపథ్యంలో ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ (Amazon) అక్టోబర్‌ 8 నుంచి ప్రత్యేక సేల్‌ను ప్రారంభిస్తోంది. ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ (Great Indian Festival Sale)’ పేరిట నిర్వహిస్తున్న ఈ సేల్‌ ఉన్న కొన్ని ఆఫర్లను ఇప్పటికే ప్రకటించింది. ముఖ్యంగా యాపిల్‌ ఉత్పత్తులపై ఇస్తోన్న ఆఫర్లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఐఫోన్‌ 13 (iPhone 13) రూ.40 వేల కన్నా తక్కువ ధరకే లభించనుంది. అలాగే మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ సైతం భారీ తగ్గింపుతో రూ.69,990కే అందుబాటులో ఉంది.

ఐఫోన్‌ 13 (iPhone 13).. 2021లో భారత్‌లో విడుదలైంది. రూ.79,900 ధర వద్ద ఇది మార్కెట్‌లోకి ప్రవేశించింది. గతకొన్ని నెలలుగా ఈ ఫోన్‌ ధర తగ్గుతూ వస్తోంది. తాజా అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ (Amazon Great Indian Festival Sale)లో రూ.40 వేల కన్నా తక్కువకే లభించనుంది. ఇటీవల ఐఫోన్‌ 15ను విడుదల చేసిన తర్వాత యాపిల్‌ స్వయంగా ఐఫోన్‌ 13 (iPhone 13) ధరను రూ.59,900కు తగ్గించింది. తాజా సేల్‌లో దీన్ని రూ.40 వేల కన్నా తక్కువ ధరకే దక్కించుకోవాలంటే వివిధ ఆఫర్లను ఉపయోగించుకోవాలి. ఎస్‌బీఐ బ్యాంక్‌ కార్డు ద్వారా కొంత రాయితీ లభిస్తుంది. అలాగే పాత స్మార్ట్‌ ఫోన్‌ను కూడా ఎక్స్ఛేంజ్‌ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఈ ఫోన్‌ తక్కువ ధరకు లభిస్తుంది.

అలాగే మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ ఎం1 (MacBook Air M1) తాజా సేల్‌లో రూ.69,990కి అందుబాటులో ఉంది. భారత్‌లో అత్యంత చౌకగా లభిస్తున్న సిలికాన్‌-పవర్డ్‌ యాపిల్‌ మ్యాక్‌బుక్‌ ఇదే కావడం గమనార్హం. ఈ మ్యాక్‌బుక్‌లో 8 GB ర్యామ్‌, 256 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ అందుబాటుులో ఉంది. యాపిల్‌ ఎం1 చిప్‌, 8-కోర్‌ సీపీయూ, 7-కోర్‌ జీపీయూ అందుబాటులో ఉన్నాయి. రూ.92,900 ప్రారంభ ధర వద్ద గతంలో దీన్ని మార్కెట్‌లో ప్రవేశపెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని