Jio Bharat B1: యూపీఐ పేమెంట్‌ ఫీచర్‌తో జియోభారత్‌ కొత్త ఫోన్‌.. ధర, ఫీచర్లివే!

Jio Bharat B1: రియలన్స్‌ జియో కొత్త 4జీ ఫోన్‌ను విడుదల చేసింది. జియో భారత్‌ బీ1 పేరిట తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో జియో పే ఆప్షన్‌ ఉంది.

Published : 13 Oct 2023 13:20 IST

Jio Bharat | ఇంటర్నెట్‌ డెస్క్‌: జియోభారత్‌ (Jio Bharat) సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను రిలయన్స్‌ జియో విడుదల చేసింది. జియోభారత్‌ బీ1 (Jio Bharat B1) పేరిట దీన్ని తీసుకొచ్చింది. గతంలో ఉన్న వీ2, కే1 కార్బన్‌ మోడళ్ల కంటే కొన్ని అదనపు ఫీచర్లతో దీన్ని తీర్చిదిద్దింది. కంపెనీ వెబ్‌సైట్‌లో దీన్ని జియోభారత్‌ బీ1 (Jio Bharat B1) సిరీస్‌ కింద ప్రత్యేకంగా లిస్ట్‌ చేశారు. ఇది 4జీ ఫోన్‌. క్రితం మోడళ్లతో పోలిస్తే స్క్రీన్‌ కొంచెం పెద్దగా ఉంది.

జియోభారత్‌ బీ1 ఫోన్‌ ధర (Jio Bharat B1 Price) రూ.1299. 2.4 అంగళాల తెర, 2,000mAh బ్యాటరీని ఇస్తున్నారు. గత మోడళ్లతో పోలిస్తే ఈ రెండు అంశాల్లో ఫోన్‌ను మెరుగుపర్చారు. జియో వెబ్‌సైట్‌లో ఫోన్‌కు సంబంధించిన చిత్రాల్లో వెనుకభాగంలో కెమెరా కూడా ఉంది. కానీ, అది ఎన్ని మెగాపిక్సెల్‌ అనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఈ ఫోన్‌లో జియో యాప్స్‌ అన్నీ ముందే ఇన్‌స్టాల్‌ చేసి ఉంటాయని కంపెనీ తెలిపింది. యూపీఐ పేమెంట్స్‌ కోసం జియోపే కూడా ఉన్నట్లు వెల్లడించింది. 23 భాషల్ని ఇది సపోర్ట్‌ చేస్తుందని పేర్కొంది. దీంట్లో జియోయేతర సిమ్‌లను ఉపయోగించడం కుదరదు. ఈ ఫోన్‌ కేవలం నలుపు రంగులో మాత్రమే అందుబాటులో ఉంది. జియో వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌లోనూ ఇది లభిస్తోంది.

జియోభారత్‌ బీ1 (Jio Bharat B1) ఫోన్‌ 0.5జీబీ ర్యామ్‌తో వస్తోంది. మైక్రోఎస్‌డీ కార్డ్‌ ద్వారా స్టోరేజ్‌ను 128జీబీ వరకు పెంచుకోవచ్చు. బ్లూటూత్‌, వైఫై, 3.5ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌, యూఎస్‌బీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని