Company Deposits: కంపెనీ ఎఫ్‌డీల తాజా వడ్డీ రేట్లు ఇవిగో..

డిపాజిటర్ల వద్ద బ్యాంకులే కాకుండా వివిధ కార్పొరేట్‌ కంపెనీలు కూడా ఎఫ్‌డీలను స్వీకరిస్తాయి. వీటి వడ్డీ రేట్లు, రేటింగ్స్ ఇక్కడ చూద్దాం.

Published : 13 Jun 2023 15:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్థిరమైన రాబడిని కోరుకునే వ్యక్తులు బ్యాంకు ఎఫ్‌డీలను ఆశ్రయిస్తారు. ఇది చాలా మందికి తెలిసిందే. అయితే, కంపెనీ ఎఫ్‌డీలు అందుకు ప్రత్యామ్నాయం. దేశంలో కొన్ని ముఖ్యమైన కార్పొరేట్‌ కంపెనీలు కూడా మదుపర్ల వద్ద ఎఫ్‌డీలను స్వీకరిస్తున్నాయి. బ్యాంకు వడ్డీ కన్నా అధిక రాబడి సంపాదించాలంటే.. కార్పొరేట్‌ కంపెనీల ఎఫ్‌డీలు వేయొచ్చు. పెద్ద బ్యాంకులతో పోల్చినప్పుడు ఈ కంపెనీలు అదనపు వడ్డీలను ఆఫర్‌ చేస్తున్నాయి. అయితే, కంపెనీ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు వాటి రేటింగ్స్ తప్పక చూసుకోవాలి. అధిక రేటింగ్ (AA, AAA) ఉన్న డిపాజిట్లలో మదుపు చేయడం మేలు. అలా AAA, AA రేటెడ్‌ కంపెనీ డిపాజిట్లు వివిధ కాలవ్యవధులకు ఎంతెంత వడ్డీ ఇస్తున్నాయో ఇక్కడ తెలియజేశాం. పట్టికను పరిశీలించండి. 

నోట్‌: ఈ డేటా 2023 జూన్‌ 6 నాటిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని