LIC Credit Cards: ఎల్‌ఐసీ క్రెడిట్‌ కార్డు గురించి మీకు తెలుసా?

ఎల్‌ఐసీ క్రెడిట్‌ కార్డుతో చెల్లించే ప్రీమియంపై యాక్సెలరేటెడ్‌ రివార్డు పాయింట్లను పొందొచ్చు, అలాగే కాంప్లిమెంటరీ బీమా కవరేజీ లభిస్తుంది.

Updated : 11 Jan 2023 20:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ దిగ్గజ బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) క్రెడిట్‌ కార్డులను (Credit cards) అందిస్తుందని చాలా తక్కువ మందికి తెలుసు. యాక్సిస్‌ బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంక్‌ భాగస్వామ్యంతో ఎల్‌ఐసీ క్రెడిట్‌ కార్డులను, గిఫ్ట్‌ కార్డులను అందిస్తుండగా... సోడెక్సో భాగస్వామ్యంతో మీల్‌ కార్డును కూడా ఇస్తోంది. ఈ కార్డులతో చేసే ఖర్చుపై రివార్డు పాయింట్లను పొందొచ్చు. అలాగే, ఎల్‌ఐసీ పాలసీ ప్రీమియం చెల్లింపులపై యాక్సెలరేటెడ్‌ రివార్డు పాయింట్లను పొందొచ్చు. ఇంధన సర్‌ఛార్జ్‌ రద్దు, డైనింగ్‌, ఎయిర్‌ లాంజ్‌ యాక్సెస్‌తో పాటు కాంప్లిమెంటరీ బీమా కవరేజీ సదుపాయం కూడా ఉంది.

యాక్సిస్‌ బ్యాంక్‌తో అందించే కార్డులు..

  • ఎల్‌ఐసీ సిగ్నేచర్‌ క్రెడిట్‌ కార్డు
  • ఎల్‌ఐసీ ప్లాటినమ్‌ క్రెడిట్‌ కార్డు
  • ఎల్‌ఐసీ టైటానియం క్రెడిట్‌ కార్డు
  • యాక్సిస్‌ బ్యాంక్‌ గిఫ్ట్‌ కార్డు

ఎల్‌ఐసీ క్రెడిట్‌ కార్డు ఫీచర్లు

రివార్డు ప్రొగ్రామ్‌: ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లింపులు, అంతర్జాతీయంగా చేసే ప్రతి రూ.100 ఖర్చుపై 2 రివార్డు పాయింట్లు లభిస్తాయి. ఇంధనం, వ్యాలెట్‌ లోడ్‌, ఈఎంఐ లావాదేవీలు తప్ప మిగిలిన చోట్ల చేసే ప్రతి రూ.100 ఖర్చుపై 1 రివార్డు పాయింట్‌ లభిస్తుంది. ఎల్‌ఐసీ రివార్డు కేటలాగ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇన్సురెన్స్‌ కవరేజీ: కార్డు పోతే.. కార్డు లిమిట్‌ వరకు కవరేజీ కాంప్లిమెంటరీగా లభిస్తుంది. రూ.3-5 లక్షల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా, రూ.1 కోటి ఎయిర్‌ యాక్సిడెంటల్‌ బీమా లభిస్తుంది.

ఇంధన సర్‌ఛార్జ్‌: భారత్‌లో ఉన్న పెట్రోల్‌ పంపుల వద్ద ఇంధనం కొనుగోలు చేస్తే 1% వరకు ఇంధన సర్‌ఛార్జ్‌ రద్దవుతుంది. అయితే లావాదేవీలు రూ.400 నుంచి రూ.4000 మధ్య ఉండాలి. ఒక నెలలో గరిష్ఠంగా రూ. 400 వరకు ప్రయోజనం లభిస్తుంది.

ఈఎంఐగా మార్చుకోవచ్చు: రూ.2500 కంటే ఎక్కువ విలువైన కొనుగోళ్ల లావాదేవీలను నెలవారీ వాయిదాగా మార్చుకోవచ్చు. తక్కువ వడ్డీ రేట్లతో తిరిగి చెల్లించవచ్చు. కొనుగోలు చేసిన 20 రోజుల్లోపు వినియోగదారులు ఇందుకోసం అభ్యర్థించాల్సి ఉంటుంది. 

యాడ్‌-ఆన్‌ కార్డులు: ప్రైమరీ కార్డుతో పాటు కుటుంబ సభ్యులు (జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, అత్తమామలు, సోదరులు, 15 ఏళ్ల లోపు వయసున్న పిల్లల కోసం) యాడ్‌ కార్డులను తీసుకోవచ్చు. 3 వరకు యాడ్‌-ఆన్‌ కార్డులను తీసుకునే సదుపాయం ఉంది.

బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌: ఎల్‌ఐసీ కస్టమర్లు బకాయి ఉన్న బ్యాలెన్స్‌ను మరొక బ్యాంకు క్రెడిట్ కార్డు నుంచి ఎల్‌ఐసీ క్రెడిట్ కార్డుకు సులభంగా బదిలీ చేయవచ్చు. బ్యాలెన్స్ బదిలీ కోసం ఎల్‌ఐసీ ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. కస్టమర్లు అందుబాటులో ఉన్న రెండు ప్లాన్ల నుంచి కావాల్సిన ప్లానును ఎంచుకోవచ్చు.

అర్హత: ప్రైమరీ కార్డు హోల్డర్‌ వయసు 18-70 ఏళ్ల మధ్య ఉండాలి. భారతీయ నివాసితులు, ఎన్నారైలు ఈ కార్డులను తీసుకోవచ్చు. రూ.3 లక్షలు అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు ఎల్‌ఐసీ టైటానియం కార్డు, రూ.5 లక్షలు అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు ఎల్‌ఐసీ ప్లాటినమ్‌ కార్డు, రూ.15 లక్షలు అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు సిగ్నేచర్‌ కార్డు తీసుకునేందుకు అర్హత ఉంటుంది. తీసుకున్న కార్డును బట్టి లభించే ప్రయోజనాల్లో కొంత వ్యత్యాసం ఉంటుంది. 

ఎలా అప్లయ్‌ చేసుకోవాలి?

ఎల్‌ఐసీ కార్యాలయానికి వెళ్లి నేరుగా కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారం పూర్తి చేసి, కావాల్సిన పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది. లేదా ఎల్‌ఐసీ క్రెడిట్‌ కార్డు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

కావాల్సిన పత్రాలు..

  • పాన్‌ కార్డు ఫొటో కాపీ
  • కలర్‌ ఫోటోగ్రాఫ్‌
  • ఆదాయ ప్రూఫ్‌ కోసం లేటెస్ట్‌ పేస్లిప్‌/బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌/ఫారం 16/ఐటీ రిటర్నుల కాపీ
  • రెసిడెన్స్‌ ఫ్రూఫ్‌ (పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటర్‌ ఐడీ, ఆధార్‌ కార్డు)
  • ఐడెంటీ  ప్రూఫ్‌ (పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటర్‌ ఐడీ, ఆధార్‌ కార్డు, పాన్‌కార్డు)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు