LIC Policy: బీమా.. సంపద వృద్ధి... ఒకే పాలసీలో

LIC Policy: జీవిత బీమాతోపాటు పెట్టుబడికీ అవకాశం కల్పిస్తూ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎల్‌ఐసీ) కొత్త పాలసీని ఆవిష్కరించింది.

Updated : 09 Feb 2024 12:36 IST

LIC Policy | జీవిత బీమాతోపాటు పెట్టుబడికీ అవకాశం కల్పిస్తూ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎల్‌ఐసీ) కొత్త పాలసీని ఆవిష్కరించింది. ఎల్‌ఐసీ ఇండెక్స్‌ ప్లస్‌ (LIC Index Plus) పేరిట తీసుకొచ్చిన ఈ పాలసీలో 60 ఏళ్ల లోపు వారెవరైనా చేరొచ్చు. 50 ఏళ్ల లోపు వారికి చెల్లించిన వార్షిక ప్రీమియానికి ఏడు నుంచి 10 రెట్లు, 51-60 ఏళ్ల వారికి ఏడు రెట్ల వరకూ బీమా రక్షణ ఉంటుంది. ప్రీమియం చెల్లింపును బట్టి, 10-15 ఏళ్ల కనీస వ్యవధి నుంచి 25 ఏళ్ల వరకూ పాలసీని కొనసాగించాల్సి ఉంటుంది. వార్షిక కనీస ప్రీమియం రూ.30వేలు. ఆరు, మూడు నెలలు, లేదా నెలనెలా ప్రీమియం చెల్లించే వీలూ ఉంది. నెలకోసారి కనీస ప్రీమియం రూ.2,500 చెల్లించాల్సి ఉంటుంది.

ఎన్‌ఎస్‌ఈ 100 ఇండెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ 50 ఇండెక్స్‌లలోని ఎంపిక చేసిన షేర్లలో పెట్టుబడులు పెట్టే ఫ్లెక్సీ గ్రోత్‌ ఫండ్‌ లేదా ఫ్లెక్సీ స్మార్ట్‌ గ్రోత్‌ ఫండ్లలో ఒకటి పెట్టుబడి కోసం ఎంచుకోవచ్చు. అయిదేళ్ల పాటు కొనసాగిన తర్వాత నిబంధనల మేరకు పాక్షికంగా కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకునేందుకు అనుమతిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని