S-Presso: మారుతీ ఎస్‌-ప్రెస్సో మరింత కొత్తగా.. ధర ఎంతంటే?

S-Presso: భారత్‌లో అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ తమ ఎంట్రీ-లెవెల్‌ హ్యాచ్‌బ్యాక్‌ ఎస్‌-ప్రెస్సోలో కొత్త వెర్షన్‌ను తీసుకొచ్చింది.

Published : 18 Jul 2022 21:43 IST

దిల్లీ: భారత్‌లో అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ తమ ఎంట్రీ-లెవెల్‌ హ్యాచ్‌బ్యాక్‌ ఎస్‌-ప్రెస్సోలో కొత్త వెర్షన్‌ను తీసుకొచ్చింది. దీని ధరల శ్రేణి రూ.4.25 లక్షల నుంచి రూ.5.99 లక్షలు (ఎక్స్‌-షోరూం). మాన్యువల్‌ వేరియంట్స్‌ కార్ల ధర రూ.4.25 లక్షల నుంచి రూ.5.46 లక్షల వరకు ఉంది. అదే ఆటోమేటిక్‌ వెర్షన్‌ ధర రూ.5.66 లక్షల వద్ద ప్రారంభమై రూ.5.99 లక్షల వరకు ఉంది. 

ఈ కొత్త ఎస్‌-ప్రెస్సో 1-లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో వస్తోంది. ఇడిల్‌-స్టార్‌-స్టాప్‌ టెక్నాలజీతో వస్తున్న ఈ కారు 25.3 కి.మీ మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది. పాత వెర్షన్లతో పోలిస్తే ఇంధన సామర్థ్యం పెరిగినట్లు వెల్లడించింది. రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, హై-స్పీడ్‌ అలర్ట్‌ సిస్టం, రివర్స్‌ పార్కింగ్‌ సెన్సార్స్‌ను అన్ని వేరియంట్లలో పొందుపరిచారు. ఆటోమేటిక్‌ వెర్షన్లలో హిల్‌ హోల్డ్‌ అసిస్ట్‌ , ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ ప్రోగ్రాం వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. 

ఎస్‌యూవీ డిజైన్‌ను పోలి ఉండే ఎస్‌-ప్రెస్సో.. హ్యాచ్‌బ్యాక్‌ సెగ్మెంట్‌లో మంచి ఆదరణ పొందిందని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ వెల్లడించారు. మూడేళ్ల క్రితం విడుదలైన ఈ మోడల్‌లో ఇప్పటి వరకు 2,02,500 యూనిట్లు విక్రయించినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని