Maruti Suzuki S-Cross: మారుతీ సుజుకీ ఎస్‌-క్రాస్‌ ప్రయాణం ఇక ముగిసినట్లేనా?

ఎస్‌-క్రాస్‌ మోడల్‌ను మారుతీ సుజుకీ తమ నెక్సా వెబ్‌సైట్‌ నుంచి తొలగించింది. దీంతో ఇక విక్రయాలు ఆగిపోయినట్లు తెలుస్తోంది.

Published : 11 Oct 2022 14:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ తీసుకొచ్చిన ఎస్‌-క్రాస్‌ కార్ల విక్రయాలు ఇక ఆగిపోనున్నట్లు తెలుస్తోంది. ఈ మోడల్‌ను కంపెనీ తమ నెక్సా వెబ్‌సైట్‌ నుంచి తొలగించింది. విక్రయాలు పూర్తిగా పడిపోయిన నేపథ్యంలోనే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు ఇటీవల సరికొత్త గ్రాండ్‌ విటారాను మారుతీ విడుదల చేయడంతో ఎస్‌-క్రాస్‌కు ఆదరణ పూర్తిగా కరవైంది.

మారుతీ సుజుకీ 2015లో ఎస్‌-క్రాస్‌ను విడుదల చేసింది. తొలుత ఇది డీజిల్‌ ఇంజిన్‌తో మాత్రమే వచ్చింది. అయితే, ఎప్పుడూ ఆశించిన స్థాయిలో మాత్రం విక్రయాలు జరగలేదు. 2020లో బీఎస్‌-6 నిబంధనలు అమల్లోకి రావడంతో డీజిల్‌ వెర్షన్‌ తయారీని నిలిపివేసి పెట్రోల్‌ ఇంజిన్‌తో తీసుకొచ్చారు. అయినా, ఈ కారు వినియోగదారులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. అప్పటికే హ్యుందాయ్‌ క్రెటా, కియా సెల్టోస్‌ విపణిలోకి వచ్చేయడంతో ఎస్‌-క్రాస్‌ వైపు చూసేవారే కరవయ్యారు. దీంతో చేసేదిలేక కంపెనీ గత నెలలో ఈ మోడల్‌ కార్ల తయారీని నిలిపివేసింది. తాజా విక్రయాలు కూడా ఆపేసినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని