Meesho: మీషో పండగ విక్రయాల్లో 68 శాతం వృద్ధి

ఈ నెల 23-27 మధ్య జరిగిన ఐదు రోజుల ప్రత్యేక పండగ సేల్‌లో తమ విక్రయాలు 68 శాతం పెరిగాయని మీషో తెలిపింది....

Published : 29 Sep 2022 14:39 IST

దిల్లీ: ఈ నెల 23-27 మధ్య జరిగిన ఐదు రోజుల ప్రత్యేక పండగ సేల్‌లో తమ విక్రయాలు 68 శాతం పెరిగాయని మీషో తెలిపింది. దాదాపు 3.34 కోట్ల ఆర్డర్లు అందినట్లు వెల్లడించింది. వీటిలో 60 శాతం టైర్‌-4 పట్టణాల నుంచి వచ్చినట్లు తెలిపింది. ఆర్డర్‌ పెట్టిన మొత్తం వినియోగదారుల్లో దాదాపు 60 శాతం మంది తొలిసారి ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసినవారని పేర్కొంది. ఈ సేల్‌ సందర్భంగా మీషో సున్నా శాతం విక్రేతల కమిషన్‌ను ప్రకటించింది. దీంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దాదాపు రూ.104 కోట్ల వరకు ఆదా చేసుకున్నాయని కంపెనీ తెలిపింది. 

వంటిగదిలో ఉపయోగించే వస్తువులకు గిరాకీ భారీగా పెరిగినట్లు మీషో తెలిపింది. ఈ కేటగిరీ విక్రయాల్లో 116 శాతం వృద్ధి నమోదైందని పేర్కొంది. సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల విక్రయాల్లో 109 శాతం, లగేజ్‌-ప్రయాణ సంబంధిత వస్తువుల విక్రయాలు 99 శాతం పెరిగినట్లు తెలిపింది. మహా దీపావళి సేల్‌ అక్టోబర్‌ 7-11 మధ్య జరగనున్నట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని