Microsoft 365: మైక్రోసాఫ్ట్ 365 సేవలకు అంతరాయం.. స్పందించిన సంస్థ

మైక్రోసాఫ్ట్‌ (Microsoft)కు చెందిన కొన్ని సర్వీసులకు అంతరాయం కలిగినట్లు పలువురు యూజర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. దీనిపై కంపెనీ స్పందించింది. త్వరలోనే ఈ సేవలను పునరుద్ధరిస్తామని ప్రకటించింది.

Published : 05 Jun 2023 22:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెక్‌ సంస్థ మైక్రోసాఫ్ట్ (Microsoft)కు చెందిన మైక్రోసాఫ్ట్ 365 (Microsoft 365) సర్వీసులకు అంతరాయం కలిగింది. ఈ మేరకు సుమారు 15 వేల మంది యూజర్లకు మైక్రోసాఫ్ట్‌కు చెందిన వర్డ్‌, ఎక్స్‌ఎల్‌తోపాటు ఇతర సేవలు పనిచేయడం లేదని ఫిర్యాదు చేసినట్లు డౌన్‌ డిటెక్టర్‌ అనే వెబ్‌సైట్‌ పేర్కొంది. అయితే, భారత్‌లో కూడా ఈ సేవలకు అంతరాయం కలిగినట్లు కొందరు యూజర్లు ట్వీట్‌ చేస్తున్నారు. డౌన్‌డిటెక్టర్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం అవుట్‌లుక్ పనిచేయడం లేదని 91 శాతం మంది, మైక్రోసాఫ్ట్ ఎక్సేంజ్‌ సేవలకు అంతరాయం కలిగిందని ఏడు శాతం మంది, షేర్‌పాయింట్ సరిగా పనిచేయడం లేదని రెండు శాతం ఫిర్యాదు చేశారు. 

ఈ ఫిర్యాదులపై మైక్రోసాఫ్ట్ స్పందించింది. ‘‘మైక్రోసాఫ్ట్ టీమ్స్‌, షేర్‌ పాయింట్‌ ఆన్‌లైన్‌, వన్‌డ్రైవ్‌ సేవలకు అంతరాయం ఏర్పడినట్లు గుర్తించాం. సమస్యకు గల కారణాలు మా సాంకేతిక బృందం గుర్తించే పనిలో ఉంది. త్వరలోనే ఈ సేవలను పునరుద్ధరిస్తాం. దీనిపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తుంటాం’’ అని ట్వీట్ చేసింది. మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం కలగడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలో భారత్‌ సహా పలు దేశాల్లో అవుట్‌లుక్‌, ఎంఎస్‌ టీమ్స్‌, అజ్యూర్‌, మైక్రోసాఫ్ట్‌ 365 వంటి సేవలు పనిచేయడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని