IPO: ప్రారంభమైన MOS యుటిలిటీ ఐపీఓ

చిన్న, మధ్యతరహ కంపెనీ MOS యుటిలిటీ ఐపీఓ మార్చి 31 నుంచి సబ్‌స్క్రిప్షన్‌ కోసం ప్రారంభమైంది. ఈ ఏప్రిల్‌ 6తో ఇష్యూ సబ్‌స్క్రిప్షన్‌ ముగుస్తుంది.

Published : 31 Mar 2023 15:33 IST

MOS యుటిలిటీ ఐపీఓm ఈ రోజు(మార్చి 31) నుంచి సబ్‌స్క్రిప్షన్‌ కోసం ప్రారంభమమైంది. ఏప్రిల్‌ 6తో పబ్లిక్‌ ఇష్యూ ముగుస్తుంది. ఈ ఐపీఓలో ఒక్కో షేరు ధర రూ.72-76గా నిర్ణయించారు. ఈ కంపెనీ షేర్లు 2023, ఏప్రిల్‌ 18న NSE చిన్న-మధ్య తరహా(SME) ప్లాట్‌ఫామ్‌లో లిస్టవుతాయని భావిస్తున్నారు. MOS యుటిలిటీ లిమిటెడ్‌(MOS) అనేది లోకల్‌గా డిజిటల్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌ను అందించే సాంకేతిక ప్రొవైడర్‌. చిరాగ్‌ షా, కుర్జిభాయ్‌ రూపరేలియా, స్కై ఓషన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ ఈ కంపెనీకి ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నారు. MOS యుటిలిటీ ఐపీఓలో రూ.10 ముఖ విలువ కలిగిన 65,74,400 ఈక్విటీ షేర్లు ఉన్నాయి. ఇందులో 57,74,400 ఈక్విటీ షేర్లు తాజా ఇష్యూ ద్వారా అందుబాటులోనుండగా, ప్రమోటర్‌ ద్వారా 8,00,000 ఈక్విటీ  షేర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌(OFS)ను కలిగి ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని