Equity Funds: మార్చిలో ఈక్విటీ ఫండ్లలోకి రూ.20,190 కోట్లు

Equity Funds: మార్కెట్‌ దిద్దుబాటును మంచి కొనుగోలు అవకాశంగా భావించిన రిటైల్‌, హెచ్‌ఎన్‌ఐ మదుపర్లు ఈక్విటీ ఫండ్లలోకి పెట్టుబడుల జోరు కొనసాగించారు.

Published : 13 Apr 2023 17:43 IST

దిల్లీ: మార్చిలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్ల (Equity Funds)లోకి నికరంగా రూ.20,190 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇటీవలి మార్కెట్‌ దిద్దుబాటును మంచి కొనుగోలు అవకాశంగా భావించిన రిటైల్‌, హెచ్‌ఎన్‌ఐ మదుపర్లు పెట్టుబడుల జోరు కొనసాగించారు. గత ఆర్థిక సంవత్సరంలో మార్చిలోనే అత్యధిక పెట్టుబడులు నమోదయ్యాయి. భారత మ్యూచువల్‌ ఫండ్‌ల సంఘం (యాంఫీ) గణాంకాల ప్రకారం.. 2023 ఫిబ్రవరిలో రూ.15,657 కోట్లు ఎంఎఫ్‌లలోకి వచ్చాయి.

హైబ్రిడ్‌ ఫండ్లలో నుంచి మార్చిలో నికరంగా రూ.12,372 కోట్లు బయటకు వెళ్లాయి. అంతక్రితం నెలలో ఈ ఫండ్లలోకి రూ.460.30 కోట్లు పెట్టుబడిగా రావడం గమనార్హం.

ఇన్‌కమ్‌/డెట్‌ కేటగిరీలో అత్యధికంగా లిక్విడ్‌ ఫండ్ల నుంచి నిధులను మదుపర్లు ఉపసంహరించుకున్నారు. మార్చిలో దాదాపు రూ.56,924.13 కోట్లు వెనక్కి వెళ్లాయి.

డెట్‌ కేటగిరీలో అత్యధికంగా కార్పొరేట్‌ బాండ్‌ పండ్లలోకి నికరంగా రూ.15,626.16 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

గ్రోత్‌/ఈక్విటీ ఫండ్లలో ఉండే 11 కేటగిరీల్లోకి నికరంగా పెట్టుబడులు రావడం విశేషం. అత్యధికంగా సెక్టోరల్‌/థిమాటిక్‌ ఫండ్లలోకి రూ.3,928.97 కోట్లు తర్వాత డివిడెండ్‌ ఈల్డ్‌ ఫండ్లలోకి రూ.3,715.15 కోట్లు వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని