Fastag KYC: ఫాస్టాగ్‌ కేవైసీ గడువు పొడిగించిన ఎన్‌హెచ్‌ఏఐ

ఫాస్టాగ్‌ కేవైసీ అప్‌డేట్‌ గడువును పొడిగిస్తున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ ప్రకటించింది. ఫిబ్రవరి 29 వరకు వెసులుబాటు కల్పించింది.

Published : 03 Feb 2024 02:17 IST

దిల్లీ: ఫాస్టాగ్‌ల (Fastag) ఈ - కేవైసీ పూర్తి చేసేందుకు గడువును మరో నెల రోజులు పొడిగిస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 29 వరకు ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. గడువు తేదీ తర్వాత కేవైసీ చేయని వాటిని డీయాక్టివేట్ చేస్తామని స్పష్టం చేసింది. ఫాస్టాగ్‌ వెబ్‌సైట్‌తో పాటు నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌ (NETC) వెబ్‌సైట్‌ ద్వారా కేవైసీ చేసుకోవచ్చని తెలిపింది. అంతకుముందు జనవరి 31 వరకు గడువు విధించిన సంగతి తెలిసిందే.

ఫాస్టాగ్‌ కేవైసీ ఇలా...

  • ఫాస్టాగ్‌ కేవైసీ స్టేటస్‌ తెలుసుకునేందుకు వెబ్‌సైట్‌ల లింక్‌పై క్లిక్ చేయాలి.
  • మొబైల్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ లేదా ఓటీపీ ఎంటర్‌ చేసి లాగిన్‌ అవ్వాలి.
  • డ్యాష్‌బోర్డులోకి వెళ్లి ‘మై ప్రొఫైల్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ మీ కేవైసీ స్టేటస్‌ కనిపిస్తుంది.
  • కేవైసీ పూర్తి కాకపోయి ఉంటే అడిగిన వివరాలు సమర్పించి ప్రాసెస్‌ చేయాలి. 
  • మొబైల్‌ నంబర్‌ ఎన్‌హెచ్‌ఏఐ వద్ద రిజిస్టర్‌ కాకుంటే.. ‘మై ఫాస్టాగ్‌’ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకుని అందులో రిజిస్టర్ చేసుకోవాలి.
  • బ్యాంకులు జారీ చేసిన ఫాస్టాగ్‌లు అయితే బ్రాంచ్‌కి వెళ్లి మొబైల్‌ నెంబర్‌ రిజిస్టర్‌ చేసుకోవాలి. ఆ తర్వాత కేవైసీ పూర్తి చేసుకోవాలి.  
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని