Nitin Gadkari: ఏ టోల్‌ ప్లాజాలోనూ పూర్తిగా రికవరీ అవ్వలేదు: గడ్కరీ

Nitin Gadkari: దేశంలోని జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన టోల్‌ ప్లాజాలు ఇప్పటివరకూ పూర్తిగా మూలధన వ్యయాన్ని రికవరీ చేయలేదని గడ్కరీ తెలిపారు.

Published : 22 Dec 2023 02:18 IST

దిల్లీ: దేశంలోని జాతీయ రహదారుల (National Highways)పై ఏర్పాటు చేసిన ఏ ఒక్క టోల్‌ ప్లాజాలోనూ (Toll Plaza) ఇప్పటివరకు మూలధన వ్యయాన్ని పూర్తిగా రికవరీ చేయలేదని కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) తెలిపారు. గురువారం లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. జాతీయ రహదారుల రుసుముల నిబంధనలు - 2008 ప్రకారం.. నిర్దేశిత గడువు పూర్తయిన తర్వాత/ మూలధన వ్యయాన్ని రికవరీ చేశాక టోల్‌ ప్లాజాలను తొలగించాలనే ఎటువంటి నిబంధనా లేదని గడ్కరీ తెలిపారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణ బాధ్యతలను నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (NHAI), నేషనల్‌ హైవేస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (NHIDCL) చూస్తాయి. 

మెజాన్‌ ప్రైమ్‌ లైట్‌ సబ్‌స్క్రిప్షన్‌ ధర తగ్గింపు.. బెనిఫిట్స్‌ ఇవే!

రవాణా సౌకర్యాలను మెరుగు పరిచేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎన్‌హెచ్‌ఏఐ పని చేస్తుంది. ఇది ప్రైవేటు కాంట్రాక్టు సంస్థల సహాయంతో వివిధ రాష్ట్రాల మధ్య హైవేలు, ఎక్స్‌ప్రెస్‌ హైవేలు నిర్మిస్తుంది. రోడ్డు వేయడానికి చేసిన ఖర్చును టోల్‌ రూపంలో వసూలు చేసి కాంట్రాక్టర్లకు చెల్లిస్తుంది. ఈ ప్రక్రియ కొన్నేళ్లపాటు సాగుతుంది. మరోవైపు, జాతీయ రహదారులపై టోల్‌ ఛార్జీల వసూలుకు జీపీఎస్‌ ఆధారిత వ్యవస్థను 2024 మార్చి నాటికి తీసుకురానునట్లు గడ్కరీ నిన్ననే ప్రకటించారు. దీనివల్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగడంతో పాటు జాతీయ రహదారిపై ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్‌ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని