Amazon Prime Lite: అమెజాన్‌ ప్రైమ్‌ లైట్‌ సబ్‌స్క్రిప్షన్‌ ధర తగ్గింపు.. బెనిఫిట్స్‌ ఇవే!

Amazon Prime Lite: అమెజాన్‌ ప్రైమ్‌ లైట్‌ సబ్‌స్క్రిప్షన్‌ ధరను అమెజాన్‌ తగ్గించింది. ఏడాది సబ్‌స్క్రిప్షన్‌ ధరను రూ.799గా నిర్ణయించింది.

Updated : 21 Dec 2023 19:08 IST

Amazon Prime Lite | ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెజాన్‌ తన ప్రైమ్‌ లైట్‌ (Amazon Prime Lite) సబ్‌స్క్రిప్షన్‌ ధరను తగ్గించింది. గతేడాది జూన్‌లో ఈ ప్లాన్‌ను అమెజాన్‌ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దీని ధరను రూ.200 మేర తగ్గించింది. అలాగే, ఈ ప్లాన్‌ ప్రయోజనాల్లోనూ కొన్ని మార్పులు చేసింది. ఇతర ప్లాన్లలో మాత్రం ఎలాంటి మార్పులూ చేయలేదు.

అమెజాన్‌ ప్రైమ్‌ లైట్‌ ఏడాది సబ్‌స్క్రిప్షన్‌కు ఇంతకుముందు రూ.999 చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా దీని ధరను రూ.799కు తగ్గించింది. ఈ మేరకు అమెజాన్‌ తన కస్టమర్‌ సర్వీస్‌ పేజీలో ప్లాన్‌ ధరలను అప్‌డేట్‌ చేసింది. రెగ్యులర్‌ అమెజాన్‌ ప్రైమ్‌ ధరను మాత్రం యథాతథంగా (రూ.1499) ఉంచింది. నెలవారీ ప్లాన్‌ ధర రూ.299, మూడు నెలల సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుంటే రూ.599 చెల్లించాల్సి ఉంటుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ లైట్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకునే వారికి దాదాపు రెగ్యులర్‌ ప్లాన్‌లో ఉండే ప్రయోజనాలే లభిస్తాయి. అయితే, ఇంతకుముందు ప్రైమ్‌ లైట్‌ యూజర్లకు రెండ్రోజుల డెలివరీకి మాత్రమే అర్హత ఉండేది. ఇప్పుడు సేమ్‌ డే, వన్‌ డే డెలివరీ సదుపాయం కూడా కంపెనీ తీసుకొచ్చింది. ఒకవేళ ఉదయాన్నే ఏదైనా వస్తువు డెలివరీ కావాలంటే రూ.175 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ‘లైట్నింగ్‌ డీల్స్‌’, ‘డీల్స్‌ ఆఫ్‌ ద డే’ యాక్సెస్‌ పొందొచ్చు. నో-కాస్ట్‌ ఈఎంఐ, ఫ్రీ డెలివరీ సదుపాయాలు కూడా ఉన్నాయి.

అమెజాన్‌ ప్రైమ్‌ లైట్‌ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారు ప్రైమ్‌ వీడియోను కేవలం మొబైల్‌లోనే వీక్షించేందుకు వీలుంటుంది. అది కూడా గరిష్ఠంగా 720pలోనే ప్లే చేసేందుకు అనుమతి ఉంటుంది. లైవ్‌ స్పోర్ట్స్‌, టీవీ షోలు ప్లే చేసేటప్పుడు యాడ్స్‌ వస్తాయి. అదే రెగ్యులర్‌ ప్లాన్స్‌లో ఎలాంటి ప్రకటనలూ ఉండవు. అమెజాన్‌ మ్యూజిక్‌, అమెజాన్‌ గేమింగ్‌, ప్రైమ్‌ రీడింగ్‌ వంటి సదుపాయాలు ఉండవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని