190km రేంజ్‌తో ఓలా కొత్త స్కూటర్‌.. ఇక 8 ఏళ్ల బ్యాటరీ వారెంటీ

Ola electric new scooter: ఓలా మరో కొత్త స్కూటర్‌ను లాంచ్‌ చేసింది. ఎస్‌1 ఎక్స్‌ శ్రేణిలో 4kWh బ్యాటరీతో ఈ స్కూటర్‌ను తెచ్చింది.

Published : 03 Feb 2024 02:19 IST

Ola Electric | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ విద్యుత్‌ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ (Ola Electric) మరో కొత్త స్కూటర్‌ను మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. తన ఎస్‌1 ఎక్స్‌ (S1X) శ్రేణిలో 4kWh బ్యాటరీ ప్యాక్‌తో కొత్త స్కూటర్‌ను తీసుకొచ్చింది. దీని ధరను రూ.1.09 లక్షలుగా నిర్ణయించింది. ఇది సింగిల్‌ ఛార్జ్‌తో 190 కిలోమీటర్లు రేంజ్‌ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

ఈ స్కూటర్‌లో 6kW మోటార్‌ను అమర్చారు. ఇది కేవలం 3.3 సెకన్లలోనే 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ తెలిపింది. దీని టాప్‌ స్పీడ్‌ 90 కిలోమీటర్లు. రెడ్‌ వెలాసిటీ, మిడ్‌నైట్‌, వోగ్‌, స్టీలర్‌, ఫంక్‌, పోర్స్‌లెయిన్‌ వైట్‌, లిక్విడ్‌ సిల్వర్‌ రంగుల్లో లభిస్తుంది. ఏప్రిల్‌ నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఇందులో 10.9 సెంటీమీటర్ల సెగ్మెంటెడ్‌ డిస్‌ప్లే ఇచ్చారు. ఫిజికల్‌ కీ అన్‌లాక్‌ ఉంటుంది. స్మార్ట్‌ కనెక్టివిటీ ఫీచర్లు ఏవీ ఇందులో ఉండవు.

₹7 వేల బడ్జెట్‌లో లావా కొత్త ఫోన్‌.. ఫీచర్లు ఇవిగో..!

8 ఏళ్లు వారెంటీ

ఈవీ బ్యాటరీ విషయంలో వినియోగదారులకు ఉన్న అనుమానాలకు తెరదించుతూ ఓలా కొత్త వారెంటీ సదుపాయాన్ని తీసుకొచ్చింది. 8 ఏళ్లు లేదా 80 వేల కిలోమీటర్ల వరకు ఎక్స్‌టెండెడ్‌ వారెంటీని ఉచితంగా ఇస్తున్నట్లు పేర్కొంది. అన్ని వాహనాలకూ ఇది వర్తిస్తుంది. కావాలంటే కిలోమీటర్ల పరిమితిని 1.25 లక్షల వరకూ పెంచుకోవచ్చని ఓలా పేర్కొంది. సర్వీస్‌ నెట్‌వర్క్‌పైనా ఓలా దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 414 సర్వీస్‌ సెంటర్లు ఉండగా.. ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి ఆ సంఖ్యను 600కు పెంచనున్నట్లు కంపెనీ తెలిపింది. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ను సైతం వచ్చే త్రైమాసికం నాటికి 10వేల పాయింట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఓలా వివరించింది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు