Lava: ₹7 వేల బడ్జెట్‌లో లావా కొత్త ఫోన్‌.. ఫీచర్లు ఇవిగో..!

Lava Yuva 3: దేశీయ మొబైల్‌ తయారీ కంపెనీ లావా యువ 3 పేరుతో కొత్త మొబైల్‌ను భారత్ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దీని ధర రూ.6,799 నుంచి ప్రారంభం అవుతుంది.

Published : 03 Feb 2024 02:17 IST

Lava Yuva 3 | ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ మొబైల్‌ తయారీ కంపెనీ లావా (Lava) కొత్త ఫోన్‌ను భారత్‌ మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. లావా యువ 2 (Lava Yuva 2), లావా యువ 3 ప్రో ( Lava Yuva 3 Pro) పేరిట తీసుకొచ్చిన మొబైల్స్‌కి ఆదరణ లభించిన నేపథ్యంలో లావా యువ 3 (Lava Yuva 3)ని ఆవిష్కరించింది. 5000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్‌ ఛార్జింగ్ సదుపాయంతో ఈ ఫోన్‌ను విడుదల చేసింది.

లావా కొత్త ఫోన్‌ రెండు వేరియంట్స్‌లో లభిస్తుంది. 4 జీబీ+64జీబీ వేరియంట్‌ ధర రూ.6,799గా కంపెనీ ప్రకటించింది. 4జీబీ +128 జీబీ వేరియంట్‌ ధర రూ.7,299గా నిర్ణయించింది. ఎక్లిప్స్‌ బ్లాక్‌, కాస్మిక్‌ లావెండర్‌, గెలాక్సీ వైట్‌ రంగుల్లో ఫోన్‌ లభిస్తుంది. ఫిబ్రవరి 7 నుంచి అమెజాన్‌లో విక్రయాలు ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది. ఫిబ్రవరి 10 నుంచి లావా ఇ-స్టోర్‌తో పాటు ఇతర రిటైల్ దుకాణాల ద్వారా కొనుగోలు చేయొచ్చని ప్రకటించింది. 

రూ.29కే కిలో బియ్యం.. వచ్చే వారం నుంచి ‘భారత్‌ రైస్‌’ విక్రయాలు

లావా యువ 3 మొబైల్‌లో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 90Hz రిఫ్రెష్‌ రేటుతో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 13 (Android 13)తో ఈ ఫోన్‌ వస్తోంది. ఆండ్రాయిడ్‌ 14 అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చని తెలిపింది. రెండేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌కు కంపెనీ హామీ ఇచ్చింది. ఇందులో యూనిసోక్‌ T606 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ అమర్చారు. కెమెరా విషయానికొస్తే.. వెనకవైపు ట్రిపుల్‌ కెమెరా ఇచ్చారు. 13 ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు ఏఐ, వీజీఏ కెమెరా సెన్సర్లు ఇచ్చారు. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం ముందు వైపు 5 ఎంపీ కెమెరా ఉంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు