Ola Electric: హైదరాబాద్‌లో మరో 3 ఓలా ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు

Ola Electric in Hyderabad: ఓలా ఎలక్ట్రిక్‌ సంస్థ కొత్తగా మరో మూడు ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లను హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఇప్పటికే ఉన్న వాటితో కలుపుకొంటే ఆ సెంటర్ల సంఖ్య ఏడుకు చేరుకుంది.  

Updated : 04 Apr 2023 19:25 IST

హైదరాబాద్‌: ప్రముఖ విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ (Ola Electric) హైదరాబాద్‌ నగరంలో మరో మూడు ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లను తెరిచేందుకు నిర్ణయించిన ఆ సంస్థ.. తాజాగా దేశవ్యాప్తంగా ఒకే రోజున ఈ తరహా 50 సెంటర్లను ఓలా ఎలక్ట్రిక్‌  ప్రారంభించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో మూడు సెంటర్లు ప్రారంభమయ్యాయి.

మాదాపూర్‌లోని శ్రీరామ కాలనీలో (హైటెక్ సిటీ రోడ్), నాగోల్‌లోని ఆదర్శ్‌ నగర్‌, మెహదీపట్నంలో రేతిబౌలిలో వీటిని ఓలా ఎలక్ట్రిక్‌ ప్రారంభించింది. దీంతో హైదరాబాద్‌లో ఓలా ఎలక్ట్రిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ల సంఖ్య ఏడుకు చేరింది. ఓలా విద్యుత్‌ వాహనాల కొనుగోలును సులభతరం చేయడంలో భాగంగా అన్ని ప్రధాన నగరాల్లో తమ ఉనికిని విస్తరిస్తున్నామని ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ సెంటర్లలో S1, S1 ప్రో మోడళ్లను టెస్ట్ రైడ్ చేసే అవకాశంతో పాటు కొనుగోలుకు ఉన్న ఫైనాన్సింగ్ ఆప్షన్లు తెలుసుకోవచ్చు.

త్వరలో కన్సర్ట్‌ మోడ్‌

ఓలా స్కూటర్లలో మూవ్‌ ఓఎస్‌ 3.0లో పార్టీ మోడ్‌ను ఓలా ఎలక్ట్రిక్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. వాహనదారుల నుంచి దీనికి మంచి స్పందన రావడంతో ఇదే తరహాలో మరో కొత్త ఫీచర్‌ను జోడించేందుకు ఓలా సిద్ధమైంది. ఓలా స్కూటర్లలో కొత్త కన్సర్ట్‌ మోడ్‌ను తీసుకురానుంది. మూవ్‌ ఓఎస్‌ 4.0 అప్‌డేట్‌లో దీన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఓలా తాజాగా తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని