Ola Electric: ఓలా ఎలక్ట్రిక్ విస్తరణ ప్రణాళిక.. భారీగా నిధులు సమీకరించేందుకు ప్లాన్!
Ola Electric Fund raising plan: ఓలా విద్యుత్ సంస్థ భారీగా నిధులు సమీకరించేందుకు నిర్ణయించింది. కార్యకలాపాల విస్తరణతో పాటు కార్పొరేట్ అవసరాల కోసం ఈ నిధులు వినియోగించుకోనుంది.
Ola Electric | బెంగళూరు: ప్రముఖ విద్యుత్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) భారీగా నిధులు సమీకరించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. సంస్థ కార్యకలాపాల విస్తరణతో పాటు కార్పొరేట్ అవసరాలు తీర్చుకునేందుకు 300 మిలియన్ డాలర్లు సమీకరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఓలా ఎలక్ట్రిక్ త్వరలోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభదాయకత అందుకుంటుందన్న అంచనాల నేపథ్యంలో భారీగా నిధులు సమీకరించేందుకు కంపెనీ సమాయత్తం కావడం గమనార్హం. గోల్డ్‌మన్ శాక్స్‌తో పాటు, మార్క్వీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ అండ్ సావరిన్ ఫండ్స్ నుంచి ఈ మొత్తాన్ని సమీకరించాలని కంపెనీ భావిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఓలా ఎలక్ట్రిక్ సంస్థ ఓలా ఎస్ 1, ఎస్ 1 ప్రో పేరిట రెండు విద్యుత్ వాహనాలను ప్రస్తుతం విక్రయిస్తోంది. వీటి డెలివరీలు ప్రారంభించి దాదాపు ఏడాది పూర్తవుతోంది. ప్రస్తుతం విద్యుత్ ద్విచక్ర వాహనాలను మాత్రమే తయారు చేస్తున్న ఆ సంస్థ.. త్వరలో ఫోర్ వీలర్లను సైతం తీసుకొచ్చేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. అలాగే బ్యాటరీ సెల్ మానుఫాక్చరింగ్ కూడా చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తమిళనాడు ప్రభుత్వంతో ఇటీవల ఒప్పందం సైతం కుదుర్చుకుంది. అతిపెద్ద ఈవీ హబ్‌ను ఏర్పాటు చేసేందుకు గానూ భూమిని సైతం సేకరించింది. ఇందులో సెల్ ఫ్యాక్టరీ, టు వీలర్, ఫోర్ వీలర్ తయారీ చేపట్టనుంది. ప్రస్తుతం నెలకు 20 వేల విద్యుత్ స్కూటర్లను ఓలా విక్రయిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 500 ఎక్స్‌పీరియన్స్ స్టోర్లు తెరవాలని నిర్ణయించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
లైఫ్ జాకెట్ లేకుండానే 15 కి.మీ. ఈత
-
కృషి బ్యాంకు డైరెక్టర్ అరెస్టు
-
ఒక్క రైతును చూసినా వణుకే!
-
Covid: భవిష్యత్తులో కరోనాలాంటి మరో మహమ్మారి రావొచ్చు: ప్రముఖ చైనా వైరాలజిస్ట్
-
Salaar: ‘సలార్’ రిలీజ్ ఆరోజేనా?.. వైరల్‌గా ప్రశాంత్ నీల్ వైఫ్ పోస్ట్
-
IND vs AUS: భారత్‌ను ఓడించిన జట్టు ప్రపంచకప్ గెలుస్తుంది: మైఖేల్ వాన్