Ola s1 Air: ఓలా ఎస్‌1 ఎయిర్‌పై ఆఫర్‌.. ₹10 వేల డిస్కౌంట్‌!

Ola s1 Air: ఓలా ఎస్‌1 ఎయిర్‌ స్కూటర్‌పై రూ.10 వేల డిస్కౌంట్‌ అందిస్తున్నట్లు ఓలా ఎలక్ట్రిక్‌ తెలిపింది. ఆగస్టు 15 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

Published : 31 Jul 2023 13:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ విద్యుత్‌ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ (Ola electric) కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఓలా ఎస్‌1 ఎయిర్‌ (S1 Air) కొనుగోలుపై రూ.10 వేల డిస్కౌంట్‌ అందిస్తున్నట్లు తెలిపింది. ఆగస్టు 15 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. అందరికీ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. 

ఓలా ఎస్‌1 శ్రేణిలో ఎస్‌1 ఎయిర్‌ పేరిట ఎంట్రీ లెవల్‌ స్కూటర్‌ను ఓలా ఎలక్ట్రిక్‌ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే దీనికి బుకింగ్స్‌ను ప్రారంభించింది. జులై 28 వరకు రిజర్వ్‌ చేసుకున్న వారికి, ఓలా కమ్యూనిటికీ రూ.1,09,999కే ఎస్‌ 1 ఎయిర్‌ను అందిస్తామని కంపెనీ ప్రకటించింది. జులై 31 నుంచి ఇతర వినియోగదారులకు బుకింగ్‌కు అవకాశం కల్పించింది. అయితే, వీరికి మాత్రం రూ.1,19,999గా తొలుత ధర నిర్ణయించింది. తాజాగా అందరికీ రూ.10వేలు తక్కువకే ఈ స్కూటర్‌ను అందిస్తామని పేర్కొంది.

SBI వాట్సాప్‌ సర్వీసులు.. సింగిల్‌ క్లిక్‌తో 15కు పైగా సేవలు

ఎస్‌1 ఎయిర్‌కు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా అందరికీ రూ.1.1 లక్షలకే ఇవ్వాలని కంపెనీ నిర్ణయించినట్లు ఓలా ఎలక్ట్రిక్‌ సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ తెలిపారు. తాము ఊహించిన దానికంటే ఎక్కువ బుకింగ్స్‌ వచ్చాయని, రిజర్వ్‌ చేసుకోని వారికీ రూ.1.1లక్షలకే ఇవ్వాలని చాలా మంది కోరినట్లు తెలిపారు. దీంతో జులై 31 రాత్రి నుంచి ఆగస్టు 15 మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఎస్‌ 1 ఎయిర్‌లో 3 kWh బ్యటరీ ఉంటుంది. ఇది సింగిల్‌ ఛార్జ్‌తో 125 కిలోమీటర్ల రేంజ్‌ వస్తుంది. గరిష్ఠంగా 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని