POCO X6 Neo: పోకో నుంచి X6 నియో.. 108 ఎంపీ కెమెరా, అమోలెడ్‌ డిస్‌ప్లే

POCO X6 Neo: పోకో నుంచి మరో 5జీ ఫోన్‌ విడుదలైంది. 108 కెమెరా, సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో ఈ ఫోన్‌ వస్తోంది.

Updated : 13 Mar 2024 16:37 IST

POCO X6 Neo | ఇంటర్నెట్‌ డెస్క్‌: పోకో (poco) ఎక్స్‌ సిరీస్‌లో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో ఇప్పటికే పోకో ఎక్స్‌ 6, పోకో ఎక్స్‌ 6 ప్రోను తీసుకొచ్చింది. తాజాగా నియో పేరిట మరో 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. పోకో ఎక్స్‌6 నియో రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.15,999 కాగా.. 12జీబీ+256 జీబీ వేరియంట్‌ ధరను రూ.17,999గా కంపెనీ నిర్ణయించింది. నేటి (మార్చి 13) సాయంత్రం 7 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు మొదలు కానున్నాయి. బ్లాక్‌, బ్లూ, ఆరెంజ్‌ రంగుల్లో లభిస్తుంది.

ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇచ్చారు. 120 రిఫ్రెష్‌ రేటు, 1000  నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఉంది. మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 6080 ప్రాసెసర్‌ను అమర్చారు. 108 ఎంపీ ప్రధాన కెమెరా, 2 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ ఇచ్చారు. 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14తో పనిచేస్తుంది. రెండు ఆండ్రాయిడ్‌ అప్‌డేట్స్‌, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ లభిస్తాయి. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఉంది. 3.5 ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్, ఐఆర్‌ బ్లాస్టర్‌, ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఉన్నాయి. ఇదే ధరలో రెడ్‌మీ నోట్‌ 13, దేశీయ బ్రాండ్‌ లావా బ్లేజ్‌ కర్వ్‌ 5జీ ఫోన్‌ లభిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని