Poco: పోకో నుంచి రెండు స్మార్ట్‌ఫోన్లు.. ధర ఎంతంటే?

Poco: మొబైల్‌ తయారీ కంపెనీ పోకో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. వీటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.

Published : 12 Jan 2024 02:08 IST

Poco smart phones | ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా మొబైల్ కంపెనీ షావోమీ సబ్‌బ్రాండ్‌ పోకో (Poco) రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. పోకో ఎక్స్‌6 (Poco X6), పోకో ఎక్స్‌6 ప్రో (Poco X6 Pro) పేరుతో వీటిని తీసుకొచ్చింది. 50ఎంపీ ప్రధాన కెమెరాతో రూపొందించిన ఈ ఫోన్‌ ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.

పోకో ఎక్స్‌6 (Poco X6) స్మార్ట్‌ఫోన్‌.. 6.67 అంగుళాల డిస్‌ప్లేతో వస్తోంది. 120Hz స్క్రీన్‌ రిఫ్రెష్‌ రేటు, 1,800 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్‌ను అమర్చారు. స్నాప్‌డ్రాగన్‌ 7ఎస్‌ జెన్‌2 ప్రాసెసర్‌తో వస్తోంది. 5,100mAh బ్యాటరీ, 167W ఫాస్ట్‌ ఛార్జింగ్ సదుపాయం ఉంది. కెమెరాల విషయానికొస్తే.. ఇందులో 50 ఎంపీ ప్రధాన కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్‌ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా ఇచ్చారు. సెల్ఫీ కోసం ముందు భాగంలో 16 ఎంపీ కెమెరా అమర్చారు. ఈ ఫోన్‌ మూడు వేరియంట్లలో అందుబాటులో రానుంది. 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.19,999గా కంపెనీ నిర్ణయించింది. 12జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.21,999గా, 12జీబీ+512జీబీ వేరియంట్‌ ధర రూ.22,999గా పేర్కొంది. మిర్రర్‌ బ్లాక్‌, స్నోస్ట్రోమ్‌ వైట్‌ రంగుల్లో లభిస్తుంది.

గూగుల్‌, అమెజాన్‌లో మరోసారి తొలగింపులు

పోకో ఎక్స్‌6 స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న డిస్‌ప్లే, కెమెరా ఫీచర్లే పోకో ఎక్స్‌6 ప్రో (Poco X6 Pro) ప్రోలో ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఇందులో మీడియాటెక్‌ డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్‌ ఉపయోగించారు. ఈ ఫోన్‌ రెండు వేరియంట్లలో రానుంది. 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.24,999గా.. 12జీబీ+ 512జీబీ వేరియంట్ ధర రూ.26,999గా కంపెనీ పేర్కొంది. ఎల్లో, రేసింగ్ గ్రే, స్పెక్టర్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది. ఈ రెండు ఫోన్లు బ్లూటూత్‌, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్‌, 3.5mm జాక్‌ యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌తో రానున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో జనవరి 16 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయని పోకో వెల్లడించింది. ప్రీ ఆర్డర్‌ బుకింగ్‌లు గురువారం రాత్రి నుంచే మొదలవుతాయని, ఈఎంఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌/డెబిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారు రూ.2వేలు ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ పొందొచ్చని కంపెనీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని