Realme C67 5G: ‘సి’ సిరీస్‌లో రియల్‌మీ ఫస్ట్‌ 5జీ స్మార్ట్‌ఫోన్‌

Realme C67 5G: మొబైల్‌ తయారీ సంస్థ రియల్‌మీ సీ67 5జీ పేరిట కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌ మార్కెట్‌లో లాంచ్‌ చేసింది.

Published : 15 Dec 2023 02:12 IST

Realme C67 5G | ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాకు చెందిన మొబైల్‌ తయారీ సంస్థ రియల్‌మీ (Realme) తన ‘సి’ సిరీస్‌లో మొదటి 5జీ ఫోన్‌ను భారత్‌ మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. రియల్‌మీ సీ67 5జీ (Realme C67 5G) పేరిట ఈ ఫోన్‌ తీసుకొచ్చింది. డ్యుయల్ కెమెరా, ఐపీ54 రేటింగ్‌, 680 నిట్స్‌ బ్రైట్‌నెస్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ వస్తోంది. మైక్రో ఎస్‌డీ కార్డు సాయంతో 2టీబీ వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.

రియల్‌మీ సీ67 5జీ ఫోన్‌ రెండు వేరియంట్లలో వస్తోంది. 4జీబీ +128జీబీ వేరియంట్‌ ధర రూ.13,999గా కంపెనీ నిర్ణయించింది. 6జీబీ+128 జీబీ వేరియంట్‌ ధర రూ.14,999గా పేర్కొంది. డార్క్‌ పర్పుల్‌, సన్నీ ఒయాసిస్‌ రంగుల్లో లభిస్తుంది. డిసెంబరు 16 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని రిటైల్‌ దుకాణాల్లో విక్రయాలు ప్రారంభం అవుతాయని రియల్‌మీ వెల్లడించింది. ప్రమోషన్‌ ఆఫర్‌ కింద ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మీ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేసేవారికి రూ.2 వేల వరకు ప్రయోజనాలు అందిస్తోంది. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌, కోటక్‌ బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డులపై ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయి.

19 నుంచి హ్యాపీ ఫోర్జింగ్స్‌ ఐపీఓ.. పూర్తి వివరాలు ఇవే..!

ఇక ఫీచర్ల విషయానికొస్తే.. రియల్‌మీ సీ67 5జీ (Realme C67 5G) ఆండ్రాయిడ్‌ 13 (Android 13) ఆధారిత రియల్‌మీ యూఐ 4.0తో పనిచేస్తుంది. 6.72 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే ఇస్తున్నారు. 120Hz రిఫ్రెష్‌ రేట్‌తో వస్తోంది. 6 నానోమీటర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌ ఇచ్చారు. డ్యూయల్ కెమెరాతో ఈ ఫోన్‌ వస్తోంది. వెనుకవైపు 50 ఎంపీ ప్రధాన కెమెరా, 2 ఎంపీ పోర్‌ట్రైట్‌ షూటర్‌ ఇచ్చారు. వీడియో కాల్స్‌, సెల్ఫీల కోసం ముందు భాగంలో 8 ఎంపీ కెమెరా అమర్చారు. 5,000 mAh బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్‌ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. టైప్‌-సి పోర్ట్‌తో రానున్న ఈ ఫోన్‌ను కేవలం 29 నిమిషాల ఛార్జ్‌తో 50 శాతం బ్యాటరీ ఛార్జ్‌ అవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని