Redmi Note 12: 5జీ సపోర్ట్‌తో రెడ్‌మీ నోట్ 12 సిరీస్ ఫోన్లు.. ఫీచర్లపై లుక్కేయండి..
Redmi Note 12 Series Phones: రెడ్‌మీ నోట్ 12 సిరీస్‌లో మూడు ఫోన్లు భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. జనవరి 11 నుంచి వీటి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ రెడ్‌మీ.. నోట్ సిరీస్ ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. రెడ్‌మీ నోట్ 11 సిరీస్‌కు కొనసాగింపుగా.. రెడ్‌మీ నోట్ 12 (Redmi Note 12) 5జీ, రెడ్‌మీ నోట్ 12 ప్రో 5జీ, రెడ్‌మీ నోట్ 12 ప్రో+ 5జీ పేరిట మూడు ఫోన్లను తీసుకొచ్చింది. ఈ మూడు ఫోన్లూ ఔట్ ఆఫ్ ది బాక్స్ ఎంఐయూఐ 13 (MIUI 13)తో పనిచేస్తాయి. రెడ్‌మీ నోట్ 12 5జీ తక్కువ ధరకే లభిస్తుండగా.. 12 ప్రో 5జీ హైఎండ్ వేరియంట్. ఈ ఫోన్ల ధర, స్పెసిఫికేషన్లు, ఆఫర్ల వివరాలు ఇప్పుడు చూద్దాం..
రెడ్‌మీ నోట్ 12 5జీ (Redmi Note 12 5g)
డ్యూయల్ సిమ్‌తో వస్తున్న 5జీ ఫోన్ ఇది. ఆండ్రాయిడ్ 12తో పనిచేసే ఎంఐయూఐ 13తో పనిచేస్తుంది. 6.67 అంగుళాల ఫుల్ హెడ్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తోంది. 120 Hz స్క్రీన్ రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. పంచ్ హోల్ డిజైన్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో కార్నింగ్ గొరిల్లా 3 ప్రొటక్షన్ ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ నాలుగో జనరేషన్ 1 ప్రాసెసర్‌తో వస్తోంది. 4జీబీ+128జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో వస్తోంది. వెనుక వైపు ట్రిపుల్ కెమెరా అందిస్తున్నారు. ప్రధాన కెమెరా 48 ఎంపీ, 8 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మ్యాక్సో సెన్సర్ అమర్చారు. సెల్ఫీల కోసం 13 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో వస్తోంది. బాక్సులోనే ఛార్జర్ ఇస్తున్నారు.
రెడ్‌మీ నోట్ 12 ప్రో 5జీ (Redmi Note 12 pro 5g)
ఇది కూడా రెడ్‌మీ 12లో ఉన్న డిస్‌ప్లే, సాఫ్ట్‌వేర్‌ను రెడ్‌మీ 12 ప్రోలోనూ అందిస్తున్నారు. ఇందులో మీడియా టెక్ డైమెన్‌సిటీ 1080 ప్రాసెసర్ అమర్చారు. ఇందులో నాణ్యమైన ఫొటోల కోసం 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 766 సెన్సర్‌ను అమర్చారు. 8 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో సెన్సర్ ఇస్తున్నారు. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
రెడ్‌మీ నోట్ 12 ప్రో+ 5జీ (Redmi Note 12 pro+ 5g)
రెడ్‌మీ నోట్ 12 ప్రో+ 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 12తో పనిచేసే ఎంఐయూఐ 13తో వస్తోంది. 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే 30 నుంచి 120 Hz వరకు మార్చుకునే వీలుండే రీఫ్రెష్‌రేట్ ఇస్తున్నారు. డాల్బీ విజన్, ముందువైపు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్ ఇస్తున్నారు. మీడియా టెక్ డైమెన్‌సిటీ 1080 ప్రాసెసర్‌తో వస్తోంది. ఇందులో 200 మెగాపిక్సల్ శాంసంగ్ హెచ్‌పీఎక్స్ సెన్సర్‌ను అమర్చారు. వెనుక వైపు 8 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో లెన్స్ ఇస్తున్నారు. ముందువైపు 16 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. ఇందులో 4980 ఎంఏహెచ్ బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కేవలం 19 నిమిషాల్లోనే ఫుల్ బ్యాటరీని ఛార్జ్ చేయొచ్చని కంపెనీ చెబుతోంది.
ధరలు ఇలా..
- రెడ్‌మీ నోట్ 12 5జీ
4జీబీ+128జీబీ వేరియంట్: రూ.17,999
6జీబీ+128 జీబీ వేరియంట్: రూ.19,999
- రెడ్‌మీ నోట్ 12 ప్రో 5జీ
6జీబీ+ 128 జీబీ వేరియంట్: రూ.26,999
8జీబీ+ 128 జీబీ వేరియంట్: రూ.27,999
- రెడ్‌మీ నోట్ 12 ప్రో+ 5జీ
8జీబీ+ 256 జీబీ వేరియంట్: రూ.29,999
12జీబీ+ 256 జీబీ వేరియంట్: రూ.32,999
ఈ మూడు మోడళ్ల అమ్మకాలు జనవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఎంఐ.కామ్, ఎంఐ హోమ్ స్టోర్లతో ఇతర రిటైల్ ఔట్‌లెట్లతో సైతం లభిస్తాయని కంపెనీ తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డులపై రూ.1500 వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. అలాగే పాత ఫోన్లను ఎక్స్ఛేంజీపై రూ.1500 ఎక్స్ఛేంజీ బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Tourism: ఈ దేశాల్లో పర్యటన.. భారతీయులకు చాలా సులువు
-
World News
School Shooting: పక్కా ప్రణాళిక రచించి.. మ్యాపుతో వచ్చి..: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
-
Movies News
Nani: ఆ రాంబాబేనా ఈ ‘ధరణి’?.. ఆసక్తికరం నాని జర్నీ!
-
Crime News
Vizag : ఆత్మహత్య చేసుకుంటామని బంధువులకు సెల్ఫీ వీడియో పంపిన దంపతులు..
-
India News
Rahul Gandhi: ‘చట్టాన్ని గౌరవించడమే.. ’: రాహుల్ ‘అనర్హత’పై అమెరికా స్పందన ఇదే..
-
Sports News
Virat -Babar: ఆ ఒక్క క్వాలిటీనే వ్యత్యాసం.. అందుకే బాబర్ కంటే విరాట్ అత్యుత్తమం: పాక్ మాజీ ఆటగాడు