Jio offer: జియో ఫ్రీడమ్‌ ప్లాన్‌.. ₹2,999 రీఛార్జిపై ₹5,800 విలువ చేసే ప్రయోజనాలు

Reliance Jio: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలయన్స్‌ జియో కొత్త లాంగ్‌ టర్మ్‌ ప్లాన్‌ను తమ యూజర్ల కోసం తీసుకొచ్చింది. ఆఫర్‌లో భాగంగా రూ.5,800 విలువ చేసే కూపన్లను ఉచితంగా అందిస్తోంది.

Published : 10 Aug 2023 14:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రిలయన్స్‌ జియో (Reliance Jio) కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఏటా స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) సందర్భంగా తీసుకొచ్చే ఆఫర్‌లో భాగంగా మరో లాంగ్ టర్మ్‌ ప్లాన్‌ను తమ కస్టమర్లకు అందించింది. స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్ కింద రూ.2,999 తో ఏడాది కాలవ్యవధితో ఈ ప్రీపెయిడ్ ప్లాన్ పరిచయం చేసింది. దీంతో పాటూ ఉచితంగా రూ.5,800 విలువైన ప్రయోజనాలను కూపన్ల రూపంలో ప్రకటించింది. లాంగ్‌ టర్మ్‌ ప్లాన్‌ కోసం ఎదురు చూస్తున్న వారు ఈ ప్లాన్‌ వివరాలపై ఓ లుక్కేయండి.

ప్లాన్‌ విషయానికొస్తే.. రూ.2999తో రీఛార్జితో తీసుకొచ్చిన ఈ జియో ప్రీపెయిడ్‌ ప్లాన్‌కు 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అపరిమిత వాయిస్‌కాల్స్‌, 100 ఎస్సెమ్మెస్‌లతో పాటు రోజుకు 2.5 జీబీ డేటా చొప్పున మొత్తం 912 జీబీ డేటా లభిస్తుంది. దీంతో పాటూ జియో క్లౌడ్, జియో టీవీ, జియో సినిమాను ఏడాది పాటూ ఉచితంగా వీక్షించవచ్చు.  స్విగ్గీ, యాత్ర, అజియో, నెట్‌మెడ్స్‌, రిలయన్స్‌ డిజిటల్‌ కొనుగోలుపై రూ.5,800 విలువైన ప్రయోజనాలను కూపన్ల రూపంలో అందిస్తోంది.

కీలక వడ్డీరేట్లు యథాతథమే

కూపన్ల విషయానికొస్తే.. స్విగ్గీ (Swiggy)లో రూ.240 కంటే ఎక్కువగా ఫుడ్‌ ఆర్డర్ చేస్తే రూ.100 డిస్కౌంట్‌ లభిస్తుంది. యాత్ర (Yatra) సాయంతో విమానాలు బుక్‌ చేసుకుంటే రూ.1500 డిస్కౌంట్, హోటళ్లలో రూ.4 వేల కంటే ఎక్కువ వెచ్చిస్తే అందులో 15 శాతం వరకు రాయితీ పొందవచ్చు. ఇక అజియో (Ajio)లో రూ.999 కొనుగోలుపై రూ.200 రాయితీ లభిస్తుంది. నెట్‌మెడ్స్‌ (Netmeds) ద్వారా రూ.999 కి కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. రిలయన్స్ డిజిటల్‌లో కొన్ని ఎంపిక చేసిన ఆడియో ఉపకరణాలు, గృహోపకరణాలపై 10 శాతం తగ్గింపు ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని