Samsung Credit card: శాంసంగ్‌ క్రెడిట్‌ కార్డ్‌.. ఏడాది పొడవునా క్యాష్‌బ్యాక్స్‌!

Samsung Credit card: యాక్సిస్‌ బ్యాంక్‌తో కలిసి శాంసంగ్‌ ఓ క్రెడిట్‌ కార్డును భారత్‌లో విడుదల చేసింది. ఈ కార్డు ద్వారా శాంసంగ్‌ ఉత్పత్తుల కొనుగోళ్లపై ఏడాది పొడవునా 10 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది.

Updated : 27 Sep 2022 12:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మొబైల్‌ఫోన్లు, టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్‌లు వంటి ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను తయారు చేసే దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్‌ (Samsung) సంస్థ ఆర్థిక సేవల రంగంలోకీ అడుగపెట్టింది. యాక్సిస్‌ బ్యాంక్‌తో కలిసి వీసా క్రెడిట్‌ కార్డును భారత్‌లో విడుదల చేసింది. ఈ కార్డు ద్వారా శాంసంగ్‌ ఉత్పత్తుల కొనుగోళ్లపై ఏడాది పొడవునా 10 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. ఈఎంఐ, నాన్‌-ఈఎంఐ లావాదేవీలకూ ఈ క్యాష్‌బ్యాక్‌ వర్తిస్తుంది.

భారత్‌లో స్మార్ట్‌ఫోన్స్‌, ట్యాబ్లెట్స్‌, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్‌మెషిన్లను శాంసంగ్‌ విక్రయిస్తోంది. వీటి కొనుగోలుకు వినియోగదారులకు ఫైనాన్స్‌ ఆప్షన్‌ ఇవ్వడం ద్వారా విక్రయాలు పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. శాంసంగ్‌ వెబ్‌పోర్టల్‌, శాంసంగ్‌ షాపింగ్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఆన్‌లైన్‌ వేదికలు, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్‌ వేదికల ద్వారా శాంసంగ్‌ ఉత్పత్తుల కొనుగోళ్లపై ఈ క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. శాంసంగ్‌ సర్వీస్‌ సెంటర్లు, శాంసంగ్‌కేర్‌+ మొబైల్‌ ప్రొటెక్షన్‌ ప్లాన్లు, ఎక్సెటెండెడ్‌ వారెంటీలకు జరిపే పేమెంట్లకూ ఈ క్యాష్‌బ్యాక్‌ వర్తిస్తుంది.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు