Samsung: శామ్‌సంగ్‌ గెలాక్సీ ఏ55, ఏ35 ధర, ఫీచర్లివే..

Galaxy A55, A35: శామ్‌సంగ్‌ గెలాక్సీ ‘ఏ’ సిరీస్‌లో మరో రెండు కొత్త ఫోన్లు మార్కెట్‌లోకి వచ్చాయి. వాటి ధరలు, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి..!

Published : 14 Mar 2024 13:55 IST

Galaxy A55, A35 | ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో శామ్‌సంగ్‌ ఇటీవల గెలాక్సీ ఏ55, ఏ35 స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించింది. తాజాగా వాటి ధరలతో పాటు పూర్తి ఫీచర్లను వెల్లడించింది. 32 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 5,000mAh బ్యాటరీ, ఎగ్జినోస్‌ ప్రాసెసర్‌ వంటి ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ల పూర్తి వివరాలేంటో చూద్దాం..

గెలాక్సీ ఏ55 ఫీచర్లు, ధరలు..

గెలాక్సీ ఏ55 (Samsung Galaxy A55) మెటల్‌ ఫ్రేమ్‌తో వస్తోంది. కీలక సమాచారాన్ని భద్రపర్చుకునేలా శామ్‌సంగ్‌ నాక్స్‌ వాల్ట్‌ అనే ఫీచర్‌ దీంట్లోని ప్రత్యేకత. 1,000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 120Hz రీఫ్రెష్‌ రేటుతో 6.6 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ ఓలెడ్‌ డిస్‌ప్లేను పొందుపర్చారు. ఎగ్జినోస్‌ 1,480 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఆండ్రాయిడ్‌ 14 ఓఎస్‌తో పనిచేయనుంది. 50ఎంపీ ఓఐఎస్‌ మెయిన్‌, 12ఎంపీ అల్ట్రావైడ్‌, 5ఎంపీ మ్యాక్రో సెటప్‌తో కూడిన కెమెరాను అమర్చారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32 ఎంపీ కెమెరా ఇచ్చారు. 25వాట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000ఎంఏహెచ్‌ బ్యాటరీని పొందుపర్చారు. వైఫై 6, ఎన్‌ఎఫ్‌సీ, బ్లూటూత్‌ 5.3 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. జీపీఎస్‌, గ్లోనాస్‌, Beidou, గెలీలియో, క్యూజెడ్‌ఎస్‌ఎస్‌ వంటి లోకేషన్ టెక్నాలజీ ఉంది. యాక్సిలరోమీటర్‌, ఫింగర్‌ప్రింట్‌, గైరో, జియోమెట్రిక్‌, హాల్‌, లైట్‌, వర్చువల్‌ ప్రాక్సిమిటీ వంటి సెన్సార్లు ఉన్నాయి. దీంట్లో మొత్తం మూడు వేరియంట్లున్నాయి. 8జీబీ + 128జీబీ ధర రూ.39,999, 8జీబీ + 256జీబీ దర రూ.42,999, 12జీబీ + 256జీబీ ధర రూ.45,999. బ్యాంకు రాయితీలు, క్యాష్‌బ్యాక్‌లు, అమెజాన్‌ వోచర్‌, శామ్‌సంగ్‌ వ్యాలెట్‌తో పేమెంట్స్‌, ఎక్స్ఛేంజ్‌ వంటి ఆఫర్లను వాడుకుంటే ధర మరింత దిగొస్తుంది. ఆసమ్‌ ఐస్‌బ్లూ, ఆసమ్‌ నేవీ రంగుల్లో ఫోన్‌ లభిస్తుంది. మార్చి 18 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. రూ.999తో ముందుగా ఆర్డర్‌ చేయొచ్చు.

గెలాక్సీ ఏ35 ఫీచర్లు, ధరలు..

గెలాక్సీ ఏ35లోనూ (Samsung Galaxy A35) కీలక సమాచారాన్ని భద్రపర్చుకునేలా శామ్‌సంగ్‌ నాక్స్‌ వాల్ట్‌ అనే ఫీచర్‌ ఉంది. 1,000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 120Hz రీఫ్రెష్‌ రేటుతో 6.6 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ ఓలెడ్‌ డిస్‌ప్లేను పొందుపర్చారు. ఎగ్జినోస్‌ 1,380 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఆండ్రాయిడ్‌ 14 ఓఎస్‌తో పనిచేయనుంది. 50ఎంపీ ఓఐఎస్‌ మెయిన్‌, 8 ఎంపీ అల్ట్రావైడ్‌, 2ఎంపీ మ్యాక్రో సెటప్‌తో కూడిన కెమెరాను అమర్చారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 13 ఎంపీ కెమెరా ఇచ్చారు. 25వాట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000 బ్యాటరీని పొందుపర్చారు. వైఫై 6, ఎన్‌ఎఫ్‌సీ, బ్లూటూత్‌ 5.3 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. జీపీఎస్‌, గ్లోనాస్‌, Beidou, గెలీలియో, క్యూజెడ్‌ఎస్‌ఎస్‌ వంటి లోకేషన్ టెక్నాలజీ ఉంది. యాక్సిలరోమీటర్‌, ఫింగర్‌ప్రింట్‌, గైరో, జియోమెట్రిక్‌, హాల్‌, లైట్‌, వర్చువల్‌ ప్రాక్సిమిటీ వంటి సెన్సార్లు ఉన్నాయి. దీంట్లో రెండు వేరియంట్లున్నాయి. 8జీబీ + 128జీబీ ధర రూ.30,999, 8జీబీ + 256జీబీ దర రూ.33,999. ఆఫర్లతో ధర మరింత తగ్గుతుంది. ఆసమ్‌ ఐస్‌బ్లూ, ఆసమ్‌ నేవీ, ఆసమ్‌ లిలాక్‌ రంగుల్లో ఫోన్‌ లభిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని