School Fee: అన్ని ర‌కాల స్కూల్ ఫీజుల‌కూ ప‌న్ను ప్ర‌యోజ‌న‌ముంటుందా?

విద్యా సంస్థ‌కు ప్ర‌భుత్వ గుర్తింపు త‌ప్ప‌నిస‌రి.

Updated : 15 Jul 2022 13:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పిల్ల‌ల విద్య‌కు ట్యూష‌న్ ఫీజుగా చెల్లించిన మొత్తానికి సంవ‌త్స‌రానికి రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు సెక్ష‌న్ 80సి కింద ప‌న్ను ప్ర‌యోజ‌నం పొందొచ్చు. ఆదాయ‌పు ప‌న్ను నిబంధ‌న‌ల ప్ర‌కారం మీ స్థూల ఆదాయం నుంచి రుసుము మొత్తాన్ని తీసివేయ‌డానికి అనుమ‌తి ఉంటుంది. త‌ద్వారా ప‌న్ను విధించ‌ద‌గిన‌ ఆదాయాన్ని త‌గ్గించ‌వ‌చ్చు. మీ పిల్ల‌ల‌కు స్కూల్ ఫీజు చెల్లిస్తున్న‌ట్ల‌యితే మీరు మునుప‌టి కంటే త‌క్కువ ప‌న్ను చెల్లిస్తారు.

కానీ మీ ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్న్‌లో స్కూల్ ఫీజు ప్ర‌యోజ‌నాన్ని పొందే ముందు, వారు సెక్ష‌న్ 80సి కింద ప‌న్ను ప్ర‌యోజ‌నం పొందేందుకు అర్హ‌త ఉందో లేదో తెలుసుకోవాలి. నిబంధ‌న‌ల ప్ర‌కారం.. పిల్ల‌లు ఏదైనా ప్లే స్కూల్ కార్య‌క‌లాపాల‌తో స‌హా పూర్తి స‌మ‌యం విద్య‌ను క‌లిగి ఉండాలి. న‌ర్స‌రీ త‌ర‌గ‌తుల నుంచి ఫీజుల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు. విద్యా సంస్థ ప్రైవేట్ లేదా ప్ర‌భుత్వ పాఠశాల అయి ఉండాలి. విద్యా సంస్థ‌కు ప్ర‌భుత్వ గుర్తింపు త‌ప్ప‌నిస‌రి. భార‌త‌దేశంలోనే ఉండాలి.

విద్యా సంస్థ‌లు వ‌సూలు చేసే ట్యూష‌న్ ఫీజులు కాకుండా ఇత‌ర చెల్లింపులు ప‌న్ను ప్ర‌యోజ‌నం పొంద‌వు. ఉదాహ‌ర‌ణ‌కు డెవ‌ల‌ప్‌మెంట్ ఫీజులు, డోనేష‌న్ లేదా క్యాపిటేష‌న్ ఫీజులు మొద‌లైన చెల్లింపులు ప‌న్ను ప్ర‌యోజ‌నానికి అర్హ‌త ఉండదు. అలాగే, త‌ల్లిదండ్రులు స‌కాలంలో ట్యూష‌న్ ఫీజు చెల్లించ‌డంలో విఫ‌ల‌మైతే, వ‌ర్తించే ఆల‌స్య రుసుము ప‌న్ను ప‌రిధిలోకి రాదు.

ట్యూష‌న్ ఫీజుపై ప‌న్ను ప్ర‌యోజ‌నం ఇద్ద‌రు పిల్ల‌లకు చెల్లించే ఫీజుల‌కు వ‌ర్తిస్తుంది. కాబ‌ట్టి ఒక జంట‌కు న‌లుగురు పిల్ల‌లు ఉంటే ఆ జంట‌ ప‌న్ను చెల్లింపుదారులు అయితే త‌ల్లిదండ్రులిద్ద‌రికీ ఇద్ద‌రు పిల్ల‌ల చొప్పున ప్ర‌త్యేక ప‌రిమితి ఉన్నందున ఇద్ద‌రూ ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను క్లెయిమ్ చేయ‌వచ్చు. చెల్లింపు చేసే త‌ల్లిదండ్రులు మాత్ర‌మే ప‌న్ను ప్ర‌యోజ‌నాన్ని పొందుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని