Demat nominee: డీమ్యాట్‌ ఖాతాలకు నామినీ గడువు పొడిగింపు

డీమ్యాట్‌ ఖాతాలకు నామినీ వివరాలు చేర్చుకునేందుకు సెబీ మరో మూడు నెలలు గడువు పెంచింది. డిసెంబర్‌ 31 వరకు అవకాశం కల్పించింది.

Published : 26 Sep 2023 20:28 IST

దిల్లీ: డీమ్యాట్‌ ఖాతాలకు నామినీ పేరును జత చేసేందుకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) మరో మూడు నెలలు అవకాశం ఇచ్చింది. వాస్తవానికి సెప్టెంబర్‌ 30తో ఈ గడువు ముగియనున్న నేపథ్యంలో డిసెంబర్‌ నెలాఖరు వరకు గడువు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఎక్స్ఛేంజీలు, డిపాజిటరీలు, బ్రోకర్స్‌, ఇతర భాగస్వామ్య పక్షాల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు డిసెంబర్‌ 31 వరకు గడువు ఇస్తున్నట్లు సెబీ ఓ సర్క్యులర్‌లో పేర్కొంది.

చాలామంది డీమ్యాట్‌ ఖాతా ప్రారంభించినప్పుడు నామినీ పేరును పేర్కొనరు. పెట్టుబడి పెట్టిన వ్యక్తికి ఏదైనా అనుకోనిది జరిగితే ఖాతాలో ఉన్న పెట్టుబడులు వారసులు క్లెయిం చేసుకోవడం కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో నామినీ వివరాలు పేర్కొనాలంటూ సెబీ సూచించింది. ఇందు కోసం తొలుత 2022 మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. తర్వాత పలు దఫాలుగా గడువు పొడిగిస్తూ వచ్చింది. ఇప్పుడు మరోసారి గడువు ఇచ్చింది.

అంబానీ వారసులకు వేతనాలు ఉండవు

సెబీ ఇచ్చిన నిర్దేశిత గడువులోగా డీమ్యాట్‌ ఖాతాదారులు తమ ఖాతాలకు నామినీ పేర్లను పేర్కొనాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలు, తోబుట్టువులు ఇలా ఎవరినైనా నామినీగా నియమించవచ్చు. తమ అకౌంట్లకు నామినీని అప్‌డేట్ చేయడం అవసరం లేదనుకుంటే ఆ విషయాన్ని కూడా వెల్లడించాల్సి ఉంటుంది. సులభతర వాణిజ్యంలో భాగంగా ట్రేడింగ్ ఖాతాల విషయంలో మాత్రం నామినేషన్ ఎంపికను స్వచ్ఛందం చేసినట్లు సెబీ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని