Interest Rates: త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌కే సెకండ్ హాండ్ కార్ల రుణాలు!

కారు విలువ‌లో 50-90% వ‌ర‌కు బ్యాంకులు రుణం ఇస్తున్నాయి.

Updated : 13 Aug 2022 14:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక‌ప్పుడు కారు ధ‌నికులు, పెద్ద వ్యాపారులకు మాత్ర‌మే అందుబాటులో ఉండేది. కార్ల కొనుగోళ్లు కూడా వీరే ఎక్కువ చేసేవారు. ఇప్పుడు మ‌ధ్య‌త‌ర‌గ‌తి, సాధార‌ణ వృత్తి నిపుణులు కూడా కార్ల‌ను విరివిగా కొంటున్నారు. అయితే ఆదాయ ప‌రిస్థితి బాగున్నవారిలో 2, 3 ఏళ్ల‌లోనే కార్ల‌ను మార్చేసేవారు ఈ మ‌ధ్య‌ చాలా ఎక్కువయ్యారు. ఈ పాత కార్లు మ‌ళ్ళీ అమ్మ‌కానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. కొత్త కార్ల‌కే కాకుండా ఇటువంటి సెకండ్ హాండ్ కార్ల‌ను కొనుగోలు చేసేవారికి కూడా బ్యాంకులు తక్కువ వ‌డ్డీ రేట్ల‌కే రుణాలు ఇస్తున్నాయి.

దాదాపు అన్ని బ్యాంకులు, ఇత‌ర ఆర్థిక సంస్థ‌లు ఇటువంటి వాహ‌నాల‌ను కొనుగోలు చేయ‌డానికి రుణాల‌ను అందిస్తున్నాయి. కాబ‌ట్టి, ఇప్పుడు సెకండ్ హాండ్ కారు కొనుగోలు కోసం రుణం పొంద‌డం చాలా సుల‌భం. కారు విలువ‌లో 50-90% వ‌ర‌కు బ్యాంకులు రుణం ఇస్తున్నాయి. ఈఎంఐల చెల్లింపుకు గ‌రిష్ఠ కాల వ్య‌వ‌ధి 1-5 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉంటుంది. అయితే, కొన్ని ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో 7 సంవ‌త్స‌రాల వ‌ర‌కు కూడా ఈఎంఐలు చెల్లించే సౌల‌భ్యాన్ని బ్యాంకులు ఇస్తున్నాయి. ఈ క్రమంలో తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు ఇస్తున్న బ్యాంకుల జాబితాను ఇక్కడ ఇస్తున్నాం.

గ‌మ‌నిక‌: ఈ డేటా 2022 జులై 26 నాటిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని