stock Market: స్వల్ప నష్టాల్లో మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు నేడు నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

Published : 07 Jul 2023 09:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వారాంతం ట్రేడింగ్‌ను స్వల్ప నష్టాలతో మొదలుపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు, మదుపర్లు లాభాల స్వీకరణ వంటి అంశాలు సూచీలను ప్రభావితం చేశాయి. ఉదయం 9.18 సమయంలో సెన్సెక్స్‌ 139 పాయింట్లు పతనమై 65,646 వద్ద, నిఫ్టీ 44 పాయింట్లు కుంగి 19,452 వద్ద ట్రేడవుతున్నాయి. జూబ్లియంట్‌ పార్మోవా, శోభా లిమిటెడ్‌, జెన్‌ టెక్నాలజీస్‌, వీగార్డ్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. బోరోసిల్‌, మెడ్‌ప్లస్‌ హెల్త్‌, చోళమండల్‌ ఫినాన్స్‌, జేకే టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు విలువ తగ్గాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 17 పైసలు బలహీనపడి 82.68కు చేరింది. 

మరోవైపు ఆసియా మార్కెట్లు మొత్తం నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన ఏఎస్‌ఎక్స్‌ సూచీ 1.45, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్‌ 0.31, హాంకాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్‌ 0.72శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.47శాతం, తైవాన్‌కు చెందిన టీఎస్‌ఈసీ 0.40శాతం కుంగాయి. ఇక గురువారం నాటి ట్రేడింగ్‌లో అమెరికా సూచీలు కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. డోజోన్స్‌ 1.07, నాస్‌డాక్‌ 0.82, ఎస్‌అండ్‌పీ 500 సూచీ 0.79శాతం పతనమయ్యాయి.

స్టాక్‌ ఎక్స్ఛేంజీ బీఎస్‌ఈ షేర్ల బైబ్యాక్‌ ప్రకటించింది. టెండర్‌ ఆఫర్‌ ద్వారా ఒక్కో షేరును రూ.816 చొప్పున, 45.9 లక్షల షేర్లను కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ.375 కోట్లు వెచ్చించనుంది. దేశీయంగా వాహన రిటైల్‌ విక్రయలు ఈ ఏడాది జూన్‌లో 10% పెరిగాయని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా గురువారం వెల్లడించింది. అన్ని విభాగాల వాహన విక్రయాలూ పెరిగినట్లు తెలిపింది. 2022 జూన్‌లో మొత్తం 17,01,105 వాహనాలు విక్రయమవ్వగా, గత నెలలో 18,63,868 వాహనాలను అమ్మినట్లు తెలిపింది. ‘వార్షిక ప్రాతిపదికన రిటైల్‌ విక్రయాలు 10% పెరిగినా, నెలవారీగా చూస్తే ఈ ఏడాది మే కంటే 8 శాతం తగ్గాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు