Stock Market: స్వల్ప నష్టాల్లో మార్కెట్‌ సూచీలు

నేడు ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను వెలువరించనుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు కూడా సూచీలను ప్రభావితం చేస్తున్నాయి. 

Published : 10 Aug 2023 09:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలు గురువారం ఉదయం 10 గంటలకు వెలువడనుండటంతో మార్కెట్లు అప్రమత్తంగా ట్రేడవుతున్నాయి. ఉదయం స్వల్ప నష్టాల్లో సూచీలు ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. 9.17 సమయంలో నిఫ్టీ 23 పాయింట్లు నష్టపోయి 19,608 వద్ద, సెన్సెక్స్‌ 80 పాయింట్లు కోల్పోయి 65,914 వద్ద ట్రేడవుతున్నాయి. ఎఫ్‌డీసీ, సుందరం ఫాస్టెనెర్స్‌, వార్రోక్‌ ఇంజినీరింగ్‌, మాక్స్‌ ఫైనాన్షియల్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. గ్రాన్యూల్స్‌ ఇండియా, టెమ్‌లీస్‌ సర్వీస్‌, రిలయన్స్‌ పవర్‌, వీ-మార్ట్‌ రిటైల్‌ షేర్లు నష్టపోతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.81 వద్ద మొదలైంది. 

బుధవారం ట్రేడింగ్‌లో అమెరికా మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. డోజోన్స్‌ 0.54, నాస్‌డాక్‌ 1.17, ఎస్‌అండ్‌పీ-500 సూచీ 0.70శాతం విలువ కోల్పోయాయి. ఈ ప్రభావం ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లపై పడటంతో నేడు ప్రధాన సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన ఏఎస్‌ఎక్స్‌ 0.16, జపాన్‌ సూచీ నిక్కీ 0.42 శాతం లాభపడగా.. చైనాకు చెందిన ఎస్‌ఈ కాంపోజిట్‌ 0.18, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్‌ 0.94, తైవాన్‌కు చెందిన టీఎస్‌ఈసీ-50 సూచీ 1.33 శాతం విలువ కోల్పోయాయి.

నేటి బోర్డు సమావేశాలు: హీరో మోటోకార్ప్‌, ఎల్‌ఐసీ, అవంతీ ఫీడ్స్‌, రామ్‌కీ ఇన్‌ఫ్రా, శిల్పా మెడికేర్‌, బయోకాన్‌, ఎన్‌సీసీ, సెయిల్‌, కంటైనర్‌ కార్పొరేషన్‌, పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, ఎన్‌బీసీసీ, గ్రాఫైట్‌ ఇండియా, లెమన్‌ట్రీ హోటల్స్‌, ఆల్‌కార్గో లాజిస్టిక్స్‌, ఎంటార్‌ టెక్నాలజీస్‌, ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌,  అశోకా బిల్డ్‌కాన్‌, టోరెంట్‌ పవర్‌, అపోలో టైర్స్‌, బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌, మణప్పురం ఫైనాన్స్‌, ఇప్కా ల్యాబ్స్‌,  పేజ్‌ ఇండస్ట్రీస్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని